ఫ్యామిలీ హీరో నుంచి పక్కా విలన్‌గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు జగపతి బాబు. ఇప్పుడు టీవీ టాక్ షో హోస్ట్‌గా కొత్త అవతారంలో సంచలన విషయాలు వెల్లడౌతున్నాయి. జయమ్ము నిశ్చయమ్మురా షోలో అక్కినేని ఫ్యామిలీ వర్సెస్ జగపతి బాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హీరోగా, విలన్‌గా రెండు పాత్రల్లోనూ జనాన్ని మెప్పించిన నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో మొదటి ఎపిసోడ్‌లోనే చర్యనీయాంశమౌతోంది. తన స్నేహితుడు నాగార్జునతో మొదటి షో నిర్వహించాడు. ఎన్నో విషయాలు సిగ్గు వదిలి మాట్లాడుకోవడం ఈ షో ప్రత్యేకత. ఎవరికీ ఇప్పటి వరకూ తెలియని విషయాలు పంచుకోవల్సి వస్తుంది. నాగార్జునతో మొదటి షోలో అదే జరిగింది. నాగార్జున-జగపతి బాబు ఇద్దరూ కలిసి చేసిన అల్లరి, న్యూసెన్స్ అంతా బయటికొచ్చింది. ఇదే షోలో నాగార్జునతో పాటు అతని సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీల కూడా కాస్సేపు సందడి చేశారు. సందర్భంగా జగపతి బాబు గురించి షాకింగ్ అంశాలు లీక్ చేశారు. ఇవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తాగి న్యూసెన్స్ క్రియేట్…అందుకే పెళ్లికి పిలవలేదు
నేను బాగా తాగి న్యూసెన్స్ క్రియేట్ చేశానని జగపతి బాబు ఒప్పుకున్నాడు. ఆ సమయంలో నాగార్జున సోదరి నాగ సుశీల తీక్షణంగా చూసిందని గుర్తు చేసిన జగ్గూభాయ్ ఆ తరువాత ఇంటికి వెళ్లలేదన్నాడు. బహుశా అందుకే తనను కొడుకు పెళ్లికి కూడా పిలవలేదని చెప్పడంతో నాగార్జున ఖండించాడు. పెళ్లికి పిలిచానని బదులిచ్చాడు. ఎప్పుడు పిలిచావంటూ జగపతి బాబు ప్రశ్నించగా ఒకరు పిలుస్తారని మరొకరు అనుకుంటుండగా సమయం గడిచిపోయిందని..సరిగ్గా పెళ్లికి ఒక రోజు ముందు పిలిచానని చెప్పాడు.
ఇలా ఆలస్యంగా పెళ్లికి పిలిచినా తాను వెళ్లానన్నాడు జగపతి బాబు. అయితే పెళ్లికి మాత్రం తాగకుండా వచ్చి బుద్ధిగా కూర్చున్నానంటూ నాగార్జున సోదరి నాగ సుశీల జగపతి బాబుకు కితాబిచ్చింది. మొత్తానికి జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షో షాకింగ్ అంశాలు బయటపెడుతోంది.