ఈ సంక్రాంతి టాలీవుడ్ కు చాలా స్పెషల్. ఎందుకంటే చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు రెండు భారీ సినిమాలతో వచ్చారు. హిట్స్ కొట్టేశారు. అయితే ఈ రెండు మూవీస్ ప్రొడ్యూస్ చేసింది కూడా మైత్రీ మూవీ మేకర్స్. ఇలా ఒకే నిర్మాణ సంస్థ నుంచి, అది కూడా పండగకు రెండు సినిమాలు రావడం తెలుగు సినీ పరిశ్రమ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్. ఇక ఈ రెండూ హిట్ అయ్యేసరికి సదరు నిర్మాణ సంస్థ యమ దూకుడుగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోన జెండా పాతేయాలని ఫిక్సయిపోవాలని అనుకుంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ తో టాలీవుడ్ కు పరిచయమైన మైత్రీ మూవీ మేకర్స్, ‘శ్రీమంతుడు’ సినిమాతో హిట్ కొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి మూవీస్ తో హ్యాట్రిక్ కొట్టింది. ఆ తర్వాత నుంచి చిన్నా పెద్ద హీరోలతో మూవీస్ చేస్తూ వేల కోట్ల టర్నోవర్స్ ని టాలీవుడ్ కు చూపించింది. ఇక తెలుగులో అందరు హీరోలతో మూవీస్ చేస్తున్న మైత్రీ సంస్థ.. త్వరలో ప్రభాస్ తో కూడా ఓ పాన్ ఇండియా ప్రాజెక్టుని లైన్ లో పెట్టింది. ఈ సినిమాను ‘పఠాన్’ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీయనున్నాడు.
అయితే ఇందులో ప్రభాస్ తోపాటు హృతిక్ కూడా నటిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. వీటిని నమ్మాలా వద్దా అని డౌట్ పడుతున్న టైంలో అతడిని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ తాజాగా కలవడం హాట్ టాపిక్ అయింది. వీళ్లతోపాటు హరీశ్ శంకర్ ఉండటం కొత్త డౌట్స్ ని రైజ్ చేస్తోంది. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి పవన్ తో సినిమా కోసం హరీశ్ వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం పాలిటిక్స్, మిగతా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో హరీశ్-మైత్రీ నిర్మాతలు ముంబయిలో చూస్తుంటే.. కొత్త కాంబో ఏదో సెట్ అయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం గ్రీకువీరుడు హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయినట్లే!
#HrithikRoshan #gopichandmalineni #HarishShankar #Naveenyerneni #mythrimoviemakers pic.twitter.com/G4lfsXTstc
— filmymarket (@filmymarket) February 4, 2023