పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. ఆయన చేసే సినిమాలు మహా అయితే ఏడాదికొకటి రిలీజ్ అవుతుంటాయి. కానీ అభిమానులు మాత్రం కోట్లల్లో ఉంటారు. ఒకవేళ పవన్ సినిమాల్లో నటించడం ఆపేసినా సరే క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అది ఆయన రేంజ్. అలాంటి యాక్టర్ తో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క నటుడికి, డైరెక్టర్ కి ఇతర టెక్నీషియన్స్ కు ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ మాత్రం చాలా తక్కువ మందికే వస్తుంది. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్.. పవన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పవన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓవైపు రాజకీయాలు, మరోవైపు పలు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ డ్రామా, వినోదయ సీతమ్ రీమేక్ ఉన్నాయి. ఇక వీటిలో హరిహర సగం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. మిగిలినవన్నీ కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇక ఈ ప్రాజెక్టుల కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రజల్లో మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా పవన్ కి అభిమానులున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ మధుబాల బయటపెట్టింది. పవన్ కు తాను డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పింది.
ఇక ‘రోజా’ సినిమాతో మనందరిని మాయ చేసిన హీరోయిన్ మధుబాల.. ప్రస్తుతం పలు సినిమాల్లో సహాయపాత్రలు చేస్తూ బిజీగా ఉంది. ఆమెనే ఇప్పుడు మాట్లాడుతూ.. అవకాశమొస్తే పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని ఉందని చెప్పింది. పవన్ స్టైల్, యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని తన అభిమానాన్ని బయటపెట్టింది. ‘అత్తారింటికి దారేది’ కన్నడ రీమేక్ లో తాను అత్తగా నటించానని, ఇక పవన్ ని చూస్తే యంగ్ అమితాబ్ బచ్చన్ లా కనిపిస్తాడని మధుబాల పేర్కొంది. ఇక ఈమె కీ రోల్ లో యాక్ట్ చేసిన ‘ప్రేమదేశం’ సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. సరే ఇదంతా పక్కనబెడితే.. మధుబాల రిక్వెస్ట్ ని మన్నించి పవన్ సినిమాలో ఆమెకు అవకాశమిస్తారేమో చూడాలి.
#Madhubala about #Pawankalyan
Follow us 👉 @tollymasti pic.twitter.com/e19FRsPmjV— Tollymasti (@tollymasti) December 17, 2022