మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా, సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో.. పూరీ జగన్నాథ్, సత్యదేవ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన సినిమా గాడ్ ఫాదర్. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో.. రామ్ చరణ్ ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు నిర్మాతలుగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇవాళ అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. రిలీజైన కొన్ని నిమిషాల్లోనే లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది ట్రైలర్. అయితే చరణ్ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అయ్యింది. సరిగ్గా ఇదే రోజున చరణ్ చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇదే రోజున చిరంజీవి గాడ్ ఫాదర్ పరీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం విశేషమనే చెప్పాలి.
స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం. మంచోళ్ళందరూ మంచోళ్లు కాదు. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక. అన్ని రంగులూ మారతాయి. నెక్స్ట్ సీఎం సీట్లో కూర్చోడానికి ఆల్ పాజిబులిటీస్ ఉన్న వ్యక్తి.. అని పాజ్ వస్తుంది. రేయ్ అన్నియ్య వచ్చేసినాడు. అన్నీ ఒగ్గేసెళ్లిపొండి. ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ మేన్ బ్రహ్మ డైలాగ్స్ తర్వాత చిరు తెల్లని బట్టల్లో నడుచుకుంటూ వస్తారు. ఆ స్టిల్ లో చిరుని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక షాట్ లో మదర్ థెరిసా ఆశ్రమం కనబడుతుంది. బహుశా సినిమాలో చిరంజీవి ఇక్కడే నివసిస్తూ ఉండవచ్చు. ఇక “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు”, నేనున్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను” అని చిరు చెప్పే డైలాగ్స్ మాత్రం కేక ఉన్నాయి.
ఇక జైల్లో 786 నంబర్ ఖైదీ దుస్తుల్లో చిరు సూపర్బ్ ఉన్నారు. జైల్లో పోరాట సన్నివేశాలు బాగానే పెట్టారు. ఒక షాట్ లో చిరు పంచె కట్టులో కనిపిస్తారు. ఆ పంచె కట్టులో అన్నయ్య చాలా బాగున్నారు. నయనతారది ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే. ‘మా పార్టీ ఆ బ్రహ్మ వెనక నిలబడదు’ అనే డైలాగ్ లో ఇంటెన్సిటీ ఉంది. సల్మాన్ ఖాన్ కేరెక్టర్ ని కూడా బాగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవికి భద్రతా సిబ్బంది పాత్రలో కనిపించి అలరించారు. చూస్తుంటే చిరంజీవి ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనబడనున్నారని తెలుస్తోంది. సీఎం ఆకస్మిక మరణం తర్వాత అప్పటి వరకూ చీకట్లో ఉన్న సింహం సింహాసనాన్ని అధిరోహించడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.
చిరు ఖైదీ ఎలా అయ్యారు? ఖైదీ నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? రాజకీయాలకి, బ్రహ్మకి కనెక్షన్ ఏంటి? గాడ్ ఫాదర్ గా ఎందుకు చీకట్లో ఉండాల్సి వచ్చింది? అనేవి సస్పెన్స్ గా ఉంచారు దర్శకుడు మోహన్ రాజా. ట్రైలర్ గమనిస్తే.. కొన్ని పరిస్థితుల వల్ల బ్రహ్మ జైలుకి వెళ్లడం, రాజకీయాల నుంచి చిరంజీవి అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆ తర్వాత సీఎం ఆకస్మిక మరణంతో తిరిగి రాజకీయాల్లోకి రావడం.. ఈ క్రమంలో బ్రహ్మని అడ్డు తొలగించేందుకు వేసే ఎత్తుగడలు, వాటిని బ్రహ్మ తిప్పికొట్టే సన్నివేశాలతో ఫుల్ ప్యాక్డ్ కంటెంట్ గా గాడ్ ఫాదర్ ఉండబోతుందని తెలుస్తోంది. మొత్తానికి బ్రహ్మ పాత్రతో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.