అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ `ఎఫ్ 3`ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమా పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ క్రమంలో అమెరికాలో F3 మూవీ చూసిన ప్రేక్షకులు తమదైన శైలీలో దీనికి రివ్యూ ఇచ్చారు. వారి మాటల్లో F3 ఎలా ఉందో తెలియాలంటే.. ఇది చూదవండి.
గతంలో వచ్చిన F2 సిరీస్‌కి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే F3. మోర్ ఫన్ అంటూ వచ్చిన ఈ చిత్రం చూసిన యూఏఎస్ ప్రేక్షకులు.. సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఫస్టాఫ్ మొత్తంలో కొన్ని సన్నివేశాల తప్ప.. F3 టీం ప్రేక్షకులను బాగానే నవ్వించే ప్రయత్నం చేశారంటున్నారు. ఇక వెంకటేష్ రేచీకటి బాధితుడిగా, వరుణ్ తేజ్ నత్తి కలిగిన వ్యక్తిగా చేసే కామెడీతో పాటు రాజేంద్ర ప్రసాద్, అలీ, సునీల్ చేసే పర్‌ఫామెన్స్‌తో సూపర్ ఫన్ క్రియేటయ్యింది అంటున్నారు. కాకపోతే.. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మాత్రం.. అబ్బో అన్నట్లు ఉన్నాయిని.. వాటిని వదిలేస్తే.. ఫస్టాఫ్ అంతా ఫుల్ కామెడీ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pragathi: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి ప్రగతి కామెంట్స్!
ఇక సెకండాఫ్‌లో అసలు స్టోరీ ప్రారంభం అవుతుంది. కాకపోతే కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ఇది ఫలనా సినిమాలో చూశామే అనిపించకమానదు అంటున్నారు. ఇక సెకండాఫ్‌లో కొన్ని మంచి కామెడీ సన్నివేశాలున్నాయి. అయితే కొన్ని సీన్లు చూసి లాజిక్ అర్థ కాక.. నవ్వాలో లేదో తెలియక సతమతం అవుతాం అని కామెంట్స్ చేశారు. ఇక పిల్లల మీద వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి అని తెలిపారు. ఇక క్లైమాక్స్‌లో అద్భుతమైన సర్‌ప్రైజ్ ఉందని తెలిపారు. మొత్తం మీద F3 పర్లేదు.. రెండు గంటలు నవ్వుకుని రిలాక్స్ కావొచ్చని కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కుర్ర హీరోలకి తలనొప్పిగా మారిన వెంకటేశ్!
వెంకటేష్ రేచీకటి బాధితుడిగా, వరుణ్ తేజ్ మేనరిజం, అలీ క్యారెక్టర్, సునీల్ పాత్ర, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఫుల్ కామెడీ పంచారని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ పాత్ర పరిధి మేరకు నటించారని.. మొత్తం మీద సినిమా బాగుందని.. కామెడీ పరంగా ఓకే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ పై స్పందించిన డైరెక్టర్ అనీల్ రావిపూడి