కత్తి మహేశ్ నిన్న మొన్నటి వరకు.. ఈయన మాట చెప్తే వివాదాలే గుర్తుకి వచ్చేవి. కానీ.., ఇప్పుడు కత్తి మన మధ్య లేరు. కత్తి చాలా సందర్భాల్లో మెజారిటీ పీపుల్ ని హార్ట్ చేసి ఉండొచ్చు.. కానీ, సొసైటీ ని పెద్దగా ఇంప్యాక్ట్ అయితే చేయగలిగాడు. అన్నీ విషయాలపై ఓపెన్ మైండ్ తో ఉండే కత్తి మహేశ్ లైఫ్ స్టైల్ చాలా సాదాసీదాగా ఉండేది.
కెరీర్ తొలినాళ్ళలో సంపాదన తక్కువగా ఉన్న సమయంలో ఎలాంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేశాడో, తరువాత ఒక హోదా వచ్చాక కూడా కత్తి అలాంటి జీవితాన్నే కొసాగించాడు. ఇక ఫ్యామిలీ కూడా దగ్గర లేకపోవడంతో కత్తి మహేశ్ పెద్దగా ఆస్తులు దాచి పెట్టింది లేదు. చివరి రోజుల్లో హాస్పిటల్ ఖర్చులకి సైతం ప్రభుత్వం సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కత్తి మహేశ్ కి జీవితంలో పెద్దగా కోర్కెలు లేకపోవడంతో ఉన్నంతలో హాయిగా జీవిస్తూ వచ్చాడు. కానీ..,ఇలాంటి కత్తి మహేశ్ ఆఖరి కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయాడు.కత్తి మహేశ్ ఫిల్మ్ డైరెక్టర్ గా సక్సెస్ కాలేకపోయాడు. నటుడిగా అద్భుతాలు చేయలేకపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇండస్ట్రీలో ఎలా అయినా సక్సెస్ కావాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ.., అవేవి వర్కౌట్ కాలేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పై కత్తి కామెంట్స్ చేయడం, అవి వైరల్ కావడం.., అనుకోకుండా పేరు రావడంతో కత్తి మహేశ్ రాజకీయాల్లో రాణించాలని కలలు కన్నాడు.
2019లో వైసీపీ నుండి ఎంపీ టిక్కెట్ సైతం ఆశించాడు. కానీ.., కత్తి ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం ఈసారి ఎన్నికల్లో అయినా బరిలో నిలిచి.., నాయకుడిగా గెలిచి, ప్రజా క్షేత్రంలోకి రావాలని కత్తి మహేశ్ చాలా ప్రణాళికలు వేసుకున్నాడు. ఇందులో భాగంగా గత కొన్ని ఏళ్లుగా వైసీపీ నేతలకి టచ్ లో ఉంటూ వచ్చాడు. ఇప్పుడిప్పుడే పార్టీ మనిషిగా కత్తికి పేరు కూడా వచ్చింది. ఇలాంటి సమయలో కత్తి మహేష్ తిరిగి రాని లోకాలకి వెళ్లిపోవడం నిజంగా విచారించతగ్గ విషయం.