సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో ఎవరూ గెస్ చేయలేరు. ట్రిపుల్ ఆర్ సినిమా చేసేటప్పుడు రామ్ చరణ్ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ సెట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆఖరికి శంకర్ తో సినిమా కన్ఫర్మ్ చేసి సర్ప్రైజ్ చేశాడు రామ్ చరణ్. తాజాగా మరో సర్ప్రైజ్ కాంబినేషన్ సెట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డైరెక్టర్ శంకర్ ఓ సినిమా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం శంకర్ – రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్ కి ఓ స్టోరీ లైన్ వినిపించారట. ఆ లైన్ జూనియర్ ఎన్టీఆర్ కి బాగా సెట్ అవుతుందని భావించి చరణ్ కి విషయం చెప్పాడట.డైరెక్టర్ చెప్పిన లైన్ విన్న చరణ్.. అవును ఈ స్టోరీ లైన్ ఎన్టీఆర్ కి బాగా సూట్ అవుతుందని చెప్పి.. ఓసారి శంకర్ చెప్పే లైన్ వినమని ఎన్టీఆర్ కి సజెస్ట్ చేసాడట. ఇక శంకర్ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ కి స్టోరీ లైన్ వినిపించడం జరిగిందట. శంకర్ చెప్పిన లైన్ పట్ల ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సినీ వర్గాల సమాచారం. రామ్ చరణ్ సినిమా అయినవెంటనే శంకర్.. ఎన్టీఆర్ కోసం స్టోరీ డెవలప్ చేయనున్నాడని టాక్.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శంకర్ చేతిలో రామ్ చరణ్ సినిమాతో పాటు అపరిచితుడు హిందీ రీమేక్, ఇండియన్ 2 సినిమాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ చేతిలో కొరటాల శివతో సినిమా తరువాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మరో సినిమా(టాక్) లైనప్ చేసుకున్నాడు. ఒకవేళ శంకర్ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే.. వీటి తర్వాతే అని అంటున్నాయి సినీవర్గాలు. మరి శంకర్ – కాంబినేషన్ లో సినిమా పడితే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.