సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ నెగ్గుకు రావాలని, తారలుగా ఎదగాలని ఎందరో ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ వారిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతూ ఉంటుంది. సినిమాల్లో నటించాలని.. హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తుంటారు. కొందరు ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోగా.. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే కంటికి కనిపించకుండా పోతుంటారు. అలాంటి వారిలో నటి అమృత కూడా ఒకరు. గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆరుగురు పతివ్రతలు సినిమాలో అమృత కూడా ఒక హీరోయిన్.
సమాజానికి ఎంతో చక్కని మెసేజ్ ఇచ్చిన ఈ సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆరుగురు విభిన్నమైన మహిళల జీవితాల గురించి చెప్తూ.. ఒక చక్కని సినిమాని రూపొందించారు. ఆ ఆరుగురిలో భర్త ఉండగానే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో అమృత నటించి మెప్పించారు. ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చిన, మనసుకు హత్తుకున్న పాత్ర అమృతది. ఇప్పటికీ ఆరుగురు పతివ్రతలు అనే సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కన్నడకు చెందిన ఈ నటి.. తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఒక తెలుగు సినిమా అనే కాదు.. ఏ సినిమాల్లోనూ కనిపించలేదు. ప్రారంభించిన చాలా కొద్ది కాలంలోనే అమృత సినిమాల నుంచి తప్పుకుంది. అన్ని భాషల్లో కలిపి హీరోయిన్ గా అమృత చేసింది కేవలం 10 చిత్రాలు మాత్రమే. ప్రస్తుతం అమృత వివాహం చేసుకొని బెంగళూరులో గృహిణిగా స్థిరపడిపోయింది. అవకాశాలు రాకపోవడం వల్లే హీరోయిన్ అమృత వివాహం చేసుకొని హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయినట్లు చెబుతున్నారు.
ఒక్క హీరోయిన్ అమృత మాత్రమే కాదు.. ఇంకా ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. తన నటనతో ఎంతో ఆకట్టుకున్న అమృత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైందనే విషయం తెలుసుకున్న ప్రేక్షకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఇవ్వాలంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఆరుగురు పతివ్రతలు సినిమా తర్వాత అమృతకు అలాంటి పాత్రలే రావడం వల్లే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారనే వాదన కూడా ఉంది. అలాంటి పాత్రలు చేయడం ఇష్టలేకనే అమృత సినిమాల నుంచి తప్పుకున్నట్లు కూడా చెబుతుంటారు.