ఈమె డిప్యూటీ సీఎం భార్య.. అయితేనేం హీరోయిన్స్ కేం తీసిపోని విధంగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. తాజాగా ఆమె ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజకీయ నాయకులు అంటే తెల్లని దుస్తులు వేసుకోవాలి, డీసెంట్ గా ఉండాలి అని కొన్ని నియమాలు ఉంటాయి. కానీ వారి కుటుంబ సభ్యులకు అలాంటి నియమాలు ఏమీ ఉండవు. కాబట్టి వారికి నచ్చినట్టు ఉండవచ్చు. అయితే కొంతమంది రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కాస్త పద్ధతిగా ఉంటారు. సోషల్ మీడియాలో ఎలా పడితే అలా ఉండరు. కానీ కొంతమంది మాత్రం తమకి నచ్చినట్టు జీవిస్తారు. అలాంటి వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ఒకరు. సినిమా హీరోయిన్ కేం తీసిపోని అందం ఈమె సొంతం. అందానికి అందం ఉంది. అలా అని టాలెంట్ ఏమైనా తక్కువ ఉందా? బహుముఖ ప్రజ్ఞాశాలి. బ్యాంకర్, క్లాసికల్ సింగర్, నటి, సోషల్ వర్కర్ ఇలా అనేక రంగాల్లో ప్రతిభ కలిగిన మహిళ.
పలు బాలీవుడ్ సినిమాలకు సింగర్ గా పని చేసిన ఈమె ఎన్నికలు వచ్చాయంటే చాలు భర్త తరపున ప్రచారం చేయడానికి ముందుకొస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడూ స్టైలిష్ ఫోటో షూట్ లు, గ్లామరస్ ఫాట్ షూట్ లతో సందడి చేస్తుంటుంది. సందర్భం వస్తే దానికి తగ్గట్టు ఆమె ఫోటో షూట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా అడవిలో పచ్చని చెట్ల మధ్య నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది. పింక్ కలర్ డ్రెస్ లో ఫోటోలు దిగి వాటిని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘కొందరు దారి తప్పి పోవడానికి మనిషి తయారుచేసిన ప్రపంచంలో సంచరిస్తారు, కొందరు తమను తాము వెతుక్కోవడానికి ప్రకృతి అడవుల్లో సంచరిస్తారు. పర్యావరణాన్ని ప్రేమించండి. పర్యావరణాన్ని ఆలింగనం చేసుకోండి, మిమ్మల్ని మీరు కనుగొనడానికి, మీ జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవడానికి పర్యావరణాన్ని రక్షించండి’ అంటూ ఆమె రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. డిప్యూటీ సీఎం భార్యవు జాగ్రత్త అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. చాలా బాగున్నారు అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఈమె 2017లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ శాంతి కార్యక్రమం నేషనల్ ప్రేయర్ బ్రేక్ ఫాస్ట్ లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఒకపక్క వర్కింగ్ వుమన్ గా ఉంటూనే.. మరో పక్క తన ఆసక్తులను, పేషన్ ను బేలన్స్ చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం భార్య అంటే ఇలానే ఉండాలి అని నియమాలకు తలొంచకుండా తనకు నచ్చినట్టు జీవిస్తూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.