సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించుకొని.. బుల్లితెరపై మెరిసిన చాలామంది సెలబ్రిటీలు అయ్యారు. అలాగని అందరూ కాలేరు. ఎందుకంటే.. అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. కానీ.. కొంతమంది విషయంలో టాలెంట్, అదృష్టాల కన్నా అందమే ఎక్కువగా కలిసి వస్తుందేమో అనిపిస్తుంది.
సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించుకొని.. బుల్లితెరపై మెరిసిన వారందరూ సెలబ్రిటీలు కాలేరు. ఎందుకంటే.. అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. కానీ.. కొంతమంది విషయంలో టాలెంట్, అదృష్టాల కన్నా అందమే ఎక్కువగా కలిసి వస్తుందేమో అనిపిస్తుంది. అలాగని టాలెంట్ లేదని కాదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం కాకుండా ఇంకా ఏం చేయగలరు అనేది మాత్రం తెలియదు. కానీ.. అందం ఉందిగా.. అలా గ్లామర్ షోతో మిలియన్స్ లో ఫాలోయర్స్ ని వెనకేసుకుంటున్నారు. అలా సోషల్ మీడియా క్రేజ్ తో టీవీ తెరపై మెరిసి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీలలో దీపికా పిల్లి ఒకరు.
దీపికా పిల్లి అనగానే ముందుగా అందరికీ టిక్ టాక్, ఢీ ప్రోగ్రామ్ గుర్తొస్తాయి. ఆ తర్వాత కామెడీ స్టార్స్, స్టాక్ ఎక్స్ చేంజ్.. ఇప్పుడు మాల్దీవ్స్.. బీచ్.. హాట్ హాట్ ఫోటోషూట్స్. ఇవే గుర్తొచ్చేలా చేస్తోంది అమ్మడు. కెరీర్ పరంగా ఆహాలో స్టాక్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రాంకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా గోవాకి లేదా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లి.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఈ బ్యూటీ గురించి యూత్ కి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. అప్ డేట్స్ తో పాటు కొత్త కొత్త ఫోటోలు పెడుతూ కుర్రకారు మనసు దోచుకుంటోంది. అందుకే ఆ స్థాయిలో ఫాలో అయిపోతున్నారు నెటిజన్స్.
ఇక ప్రెజెంట్ దీపికా మాల్దీవ్స్ వెకేషన్ లో ఉంది. ఈ విషయాన్ని పదేపదే గుర్తు చేస్తూ.. గ్లామర్ ప్రియులు ఆస్వాదించేలా అందాల ప్రదర్శన చేస్తోంది. తాజాగా బీచ్ ఇసుకలో పొట్టి పొట్టి కాస్ట్యూమ్ లో.. లేలేత అందాలను ఫ్యాన్స్ కి ఎరగా వేసింది. ఇంకేముంది అసలే అందం కనిపిస్తే.. ఫాలో కొట్టి, ఆరాధించేవారు నెట్టింట ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. థండర్ థైస్ తో పాటు టాప్ టు బాటమ్ తన పరువాలతో కనివిందు చేసే ఫోటోలు పోస్ట్ చేసింది దీపికా. పొట్టి నిక్కరు, పొట్టి బ్లౌజ్‌లో నడుము హొయలను కూడా ఆవిష్కరించి రచ్చ లేపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు దుమారం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా.. గతేడాది ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీతో హీరోయిన్ గా డెబ్యూ చేసింది దీపికా. మరి ఈ యంగ్ బ్యూటీ అందాల విందుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.