Cannes: ఫ్రాన్స్ దేశంలో 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరగుతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఈ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన తారలు రెడ్ కార్పెట్ పై తమ అందాలతో కనువిందు చేస్తారు. ఇందుకు కోసం విభిన్నమైన వస్త్రాధారణతో అందరిని ఆకట్టుకుంటారు. ఈ వేడుకల్లో స్పెషల్ డిజైన్ చేసిన దుస్తుల తో పాటు ఆకర్షణీమయైన ఆభరణాలతో సినీ తారలు తళుక్కున్న మెరుస్తారు. ఈ సందర్భంగా కేన్స్ వేడుకలో దీపికా పదుకొనే కూడా విభిన్న వస్త్రాధారణతో ఆకట్టుకుంది. ఆమె ధరించిన నెక్లెస్ అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం దాని ధర హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ నెక్లెస్ ధర తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ వేడుకలకు ఇండియా నుంచి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. దీపికా పదుకొనే తమన్నా, ఊర్వశీ రౌతేలా వంటి అందాల భామాలు ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వీళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. కేన్స్ వేడుకలో నలుపు రంగు సూట్ మీద దీపికా ధరించిన వజ్రాల నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్వాకాలం నాటి కంటెను తలపించేలా ఉన్న ఈ నెక్లెస్ కు ముందు భాగంలో పులి ముఖాలు వచ్చేలా డిజైన్ చేశారు.
ఇదీ చదవండి: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆకట్టుకున్న బుట్టబొమ్మ పూజా! ఫోటోలు వైరల్..
ఈ పులుల కళ్ల స్థానంలో ఖరీదైన పచ్చలను పొదిగి ఉంది. అయితే ఈ నెక్లెస్‌ను ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్ తయారు చేసిందని సమాచారం. పూర్తిగా 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ నెక్లెస్ ధర సుమారుగా రూ. 3.8 కోట్లు ఉంటుందని అంచనా. ఇక దీని ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.