టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ వర్సెస్ ధనశ్రీ వ్యవహారం ముగిసినా ఇంకా నెట్టింట ట్రోలింగ్ ఆగలేదు. ఇప్పుడు ఆ టీ షర్ట్ ఎందుకు ధరించావంటూ మాజీ భార్య ధనశ్రీ ఆగ్రహించింది. వాట్సప్‌లో పంపిస్తే సరిపోయేది కదా అంటోంది. అసలేంటీ టీ షర్ట్ గొడవ తెలుసుకుందాం..
టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్‌కు కొరియోగ్రాఫర్ భార్య ధనశ్రీకు విడాకులు మంజూరైనా ఇంకా ఇద్దరి మధ్య ఆరోపణలు ఆగలేదు. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా నిందలు వేసుకుంటున్నారు. హ్యూమన్స్ ఆఫ్ బోంబే కోసం ధనశ్రీ ఇచ్చిన ఓ పోడ్ కాస్ట్‌లో విడాకులపై ధనశ్రీ స్పందించింది. విడాకుల సమయంలో చాహల్ ధరించిన టీ షర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ టీ షర్ట్ ఎందుకు ధరించావంటూ ఇంటర్వ్యూ వేదికగా నిలదీసింది. కోర్టులో విడాకుల తీర్పు ఇచ్చే సమయంలో చాలా భావోద్వేగానికి లోనయ్యానంటోంది. అందరి ముందు ఏడ్చేశానని చెప్పింది. కోర్టు నుంచి ఇంటికొచ్చేవరకు ఏడూస్తూనే ఉన్నానంటోంది. తను మాత్రం బయటకు వెళ్లిపోయాడని తెలిపింది.
టీ షర్ట్ గొడవ
విడాకులు మంజూరైన రోజు యజువేంద్ర చాహల్ ఓ టీ షర్ట్ ధరించాడు. దానిపై బీ యువర్ ఓన్ షుగర్ డాడీ అని రాసుంది. ఇది చూసిన ధనశ్రీ…చాహల్‌పై ఫైర్ అయింది. ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పొచ్చు కదా..బహిరంగంగా ఎందుకు ప్రదర్శించడం అంటోంది. ఆ టీ షర్ట్ కావాలనే ధరించాడంటోంది. టీ షర్ట్ ఎందుకు ధరించావ్, వాట్సప్ చేయాల్సింది కదా అంటూ మండిపడింది. ఈ ఇద్దరూ 2020 డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. కోవిడ్ సమయంలో డ్యాన్స్ పాఠాల కోసం ధనశ్రీని కలిసినప్పుడు ఇద్దరి మధ్య బంధం మొదలైంది. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలానికే అంటే రెండేళ్లకే మనస్పర్ధలతో విడిపోయారు.