వాల్తేరు వీరయ్య సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరంజీవి. ఏడాది ప్రాంరభంలోనే బాక్సాఫీస్ వద్ద.. మెగా ప్రభంజనం సృష్టించాడు బాసు. సినిమా విడుదలయ్యి.. పది రోజులు కావొస్తున్నా.. ఇప్పటికి హౌస్‌ఫుల్ బోర్డులతో కిటకిటలాడుతున్నాయి థియేటర్లు. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు వీరయ్య. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరి.. రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అని సినిమాలో చెప్పిన డైలాగ్‌ని.. చిత్రం విడుదల తర్వాత నిజం చేసి చూపారు చిరంజీవి. స్టార్ హీరోలు.. వందల కోట్ల రూపాయలతో.. భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్‌లతో తెరకెక్కుతున్న ఎన్నో సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లా పడుతున్న వేళ.. మెగాస్టార్ మాత్రం.. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్నారు.
ఇండస్ట్రీలో తాను మాత్రమే ఎదిగితే సరిపోదని.. తనలానే.. ఇండస్ట్రీలోని అందరూ అలానే బాగుండాలని కోరుకునే నైజం చిరంజీవి సొంతం. స్టార్ హీరోలు, చిన్న హీరోలు సైతం.. ఏడాదికి ఒకటి, అరా చిత్రాలు విడుదల చేస్తుంటే.. చిరంజీవి మాత్రం.. ఇప్పటికి ఏటా రెండు మూడు చిత్రాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. మరి ఈ వయసులో ఆయన అంత కష్టపడటం అవసరమా అంటే.. చిరంజీవికి అక్కర్లేదు. కానీ తన లాంటి స్టార్ హీరో.. ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తే.. ఇండస్ట్రీలో వందల మందికి ఏడాదంతా చేతి నిండా పని ఉంటుంది.. వారి కుటుంబాలు బాగుంటాయి అని ఆలోచించగలిగే గొప్ప గుణం కేవలం చిరంజీవికి మాత్రమే సొంతం.
చిరంజీవిని వెటరన్ హీరో అనేవాళ్లు.. ఆ మాట అనడానికి సిగ్గు పడాలి. 60 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేయడమే కాక.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు చిరంజీవి. రీఎంట్రీలోనే ఆయన చేసిన సినిమాల్లో.. వరుసగా మూడు చిత్రాలు 100 కోట్ల క్లబ్లో చేరాయంటే.. బాస్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల విషయంలో నేటికి ఏ హీరో కూడా చిరంజీవి దరిదాపుల్లోకి రాలేరు.
సిని పరిశ్రమలోకి వచ్చి సుమారు 40 ఏళ్లు అవుతున్నప్పటికి.. నేటికి ఆయన నిత్య విద్యార్థే. ప్రస్తుత కాలంలో.. దర్శక, నిర్మాతలు.. హీరో, హీరోయిన్ల రాక కోసం ఎదురు చూస్తారు. కానీ చిరంజీవి మాత్రం.. నేటికి కూడా 9 గంటలకు షూటింగ్ అంటే.. 7. 30 గంటల వరకే సెట్‌కు చేరుకుంటారు.. అది కూడా మేకప్ వేసుకుని రెడీగా వెళ్తారు. ఎందుకంటే తన వల్ల షూటింగ్ ఆలస్యం అయితే.. నష్టపోయేది నిర్మాత. తన వల్ల పది మంది బాగుపడాలి తప్పితే.. ఎవ్వరూ రూపాయి నష్టపోకూడదు అనేది చిరంజీవి సిద్ధాంతం.
ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే ఎవరైనా సరే.. సినిమా అంటే పాషన్‌తో ఉండాలి.. నిత్యం అదే ఆలోచనలో బతకాలి అంటారు చిరంజీవి. లేదు నేను అలా చేయలేను అనుకుంటూ.. బెటర్ మీరు ఇండస్ట్రీని వదిలి వెళ్లండి అనే చిరంజీవి మాటలు వింటే.. సినిమాల పట్ల ఆయన పాషన్ ఎలాంటిదో చెప్పకనే చెబుతుంది. పనిని ప్రేమించాలి.. అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలి.. ఇవి రెండు ఉంటే జీవితంలో.. ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అనే దానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి. ఇండస్ట్రలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుంగా వచ్చిన చిరు.. తనను తాను మెరుగుపర్చుకుంటూ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ రేంజ్‌కు చేరుకున్నారు.
చాలా మంది స్టార్ హీరోలు.. చిన్న హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను చిన్న చూపు చూస్తారనే విషయం తెలుసు. ఇక కొన్ని ఇండస్ట్రీల్లో అయితే.. కొత్త వారిని రానివ్వరు.. ఎదగనివ్వరు. కానీ చిరంజీవి మాత్రం.. తాను నడిచిన వచ్చిన మూలాలను మర్చిపోలేదు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లల్లో.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలుసు కాబట్టి.. అలాంటి వారికి నేనున్నాంటూ మద్దతిస్తాడు చిరంజీవి. అందుకే మిగతా స్టార్ హీరోలకు భిన్నంగా.. చిన్న హీరోలు, వేరే హీరోల సినిమాల ఫంక్షన్లకు వెళ్తుంటారు చిరంజీవి. వారి సినిమాలు ఘన విజయం సాధించాలని.. ఇండస్ట్రీలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకోగలిగే గొప్ప మనసు చిరంజీవి సొంతం. తెర మీద హీరోగా.. వాస్తవంగా ఎందరినో ఆదుకునే ఆప్తుడిగా.. అభిమానుల గుండెల్లో అన్నయ్యగా.. తెలుగు ఇండస్ట్రీలో మెగా స్టార్‌గా ఎదిగిన చిరంజీవి.. రియల్ హీరో. మరో పది తరాలు గడిచినా.. చిరంజీవి లాంటి హీరో రాడు.. రాలేడు. దటీజ్ మెగాస్టార్. మరి మీరేమంటారు..!