ఇండస్ట్రీకి చిరుత వచ్చి 15 ఏళ్ళు అయ్యింది. 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఒక మైండ్ బ్లాక్ డైరెక్టర్ ఆలోచనల బోనులోంచి ఒక మెగా పవర్ వైల్డ్ యానిమల్ చిరుత బయటకొచ్చింది. ‘చిరు’తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటుడిగా, హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోజు ఈరోజే. 2007 సెప్టెంబర్ 28న రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చరణ్. అసలు ఇంట్రడక్షన్ సీన్ లో చరణ్ ఎంట్రీ చూస్తే మెంటలొచ్చేస్తుంది. ముసుగులో ఫైట్ చేస్తూ.. గాల్లో ఎగురుతూ ఫేస్ రివీల్ అయ్యే సీన్ చూస్తే గూస్ బంప్సే. మొదటి సినిమాతోనే రాజమౌళి మనసు గెలుచుకుని మగధీర సినిమాలో నటించారు.
రెండవ సినిమా ఇండస్ట్రీ హిట్ అనేది అసాధ్యం. అలాంటిది రామ్ చరణ్ ఈ అరుదైన ఫీట్ ని సాధించారు. మగధీర సినిమాకి వేరే హీరో అయితే బాగుంటుందేమో అన్న ఆలోచన రానివ్వలేదు చరణ్. దాయడానికి లేదు, దాట వేయడానికి లేదు. అందరికీ తెలిసిందే. ఆరెంజ్ సినిమా నుంచి చరణ్ నటన ఒకేలా ఉంటుంది, ఒకే ఎక్స్ ప్రెషన్స్ అని విమర్శలు వచ్చాయి. బ్రూస్ లీ సినిమా వరకూ ట్రోల్స్, విమర్శలు ఇలా చాలా ఎదురయ్యాయి. అక్కడ ఉన్నది ఎవరు లెజెండరీ యాక్టర్ చిరంజీవి కొడుకు చరణ్. అనుభవ పాఠాలు నేర్చుకోకుండా ఎలా ఉంటారు? ఇంట్లో చిరు అనే మెగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని పెట్టుకుని నటనలో మెళకువలు నేర్చుకోకుండా ఎలా ఉంటారు? అందుకే కసిగా తన నటనను మెరుగు పరచుకున్నారు.
ఒకప్పుడు చూసిన చరణ్ కాదు ఇప్పుడున్నది. ఇప్పుడున్న చరణ్ వేరే. ఒక ధృవ, ఒక రంగస్థలం, మొన్న సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ ఈ సినిమాలు చాలు చరణ్ అంటే ఏంటో చెప్పడానికి. నటన రాదు అని విమర్శలు ఎదుర్కునే స్టేజ్ నుంచి నటన తప్ప ఇంకేమీ రాదు అన్న స్థితికి ఎదిగారు. నటుడిగా ఇంతకంటే ఏం కావాలి ఏ నటుడికైనా. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. తండ్రికి తగ్గా తనయుడు అనిపించుకున్నప్పుడు, తండ్రిని మించిన యోధుడు అయినప్పుడు, తండ్రి కంటే గొప్పగా ఎదిగినప్పుడు, తండ్రికి గొప్ప పేరు తీసుకొచ్చినప్పుడు, ఒక తండ్రి కొడుకు అని పిలిపించుకునే స్టేజ్ నుంచి తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చుకుని తన పేరుతో జీవిస్తున్నప్పుడు.. ఆ తండ్రికి కలిగే ఆనందం, పుత్రోత్సాహం ఇంకెక్కడుంటుంది చెప్పండి.
ప్రస్తుతం చిరంజీవి పుత్రోత్సాహం కూడా అదే. తన కొడుకు ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు వచ్చిన సందర్భంగా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు. “15 ఏళ్ల మైలురాయిని చేరుకోవడం అనేది రామ్ చరణ్ సినీ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తోంది. చిరుత సినిమా నుంచి మగధీర, మగధీర నుంచి రంగస్థలం, రంగస్థలం నుంచి ఆర్ఆర్ఆర్, ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో RC 15 వరకూ చరణ్ ఎదిగిన తీరు హృద్యంగా ఉంది. చరణ్ అభిరుచికి, కష్టపడే తత్వానికి, అంకిత భావానికి, చేసే పని ఏదైనా అందులో రాణించాలనుకునే సహజమైన కోరికకి చాలా సంతోషిస్తున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను అబ్బాయ్. నీ కోసం ఎదురుచూసే మరెన్నో ఉన్నత శిఖరాలు ఉన్నాయి. వెళ్ళు. ఆ దైవం నీతో ఉంటుంది” అంటూ భావోద్వేగంతో, బరువెక్కిన పదాలతో కొడుకు మీద ప్రేమని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చిరు ఇంతలా భావోద్వేగానికి గురవ్వడం వెనుక చరణ్ కృషి ఎంతో ఉంది. ఆ కృషిని చిరు స్వయంగా చూశారు కాబట్టే ఎమోషనల్ అయ్యారు. చరణ్ ఇలా ఎదుగుతారని ఆయన కూడా అనుకుని ఉండరు. ఇవాళ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం అంటే అది చరణ్ వ్యక్తిగత కష్టమే. ఏ తండ్రీ ఊహించినంత ఎత్తుకి ఏ కొడుకు ఎదిగినా ఇలానే ఆ తండ్రి సంతోషిస్తారు. గర్వపడతారు. చరణ్ ఇంకా ఉన్నత శిఖరాలను అధిగమించాలని, తండ్రిని మించిన యోధుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలని కోరుకుంటూ.. 15 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తుంది సుమన్ టీవీ.
Supremely pleased at his passion, body of work, dedication and his innate urge to excel at what he does.
Proud of you my boy! Here’s to greater heights and greater glories that await you! Go for it!
May the Force be with you!@AlwaysRamCharan pic.twitter.com/kby2zqzRbm
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022