తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ రేంజ్ కి ఎదిగారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి జీవితంపై ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కానీ ఆయన ఏనాడూ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పని ఓ ఆసక్తికర విషయం తొలిసారి ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్ లో అమీర్ ఖాన్ లీక్ చేయించాడు. మెగాస్టార్ చిరంజీవి తొలి ప్రేమ గురించి ఓపెనయ్యేలా చేశారు అమీర్ ఖాన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకులుగా ఉన్నారు. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున తనయుడు నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా అమీర్, చిరు, నాగ చైతన్యలను కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఈ సందర్భంగా చిరు నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవిని మీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు అన్ని ప్రశ్నించారు. దానికి చిరునవ్వుతో చిరంజీవి మరి దాన్ని ఆకర్షణ అంటారో ఏదో తెలియదు కానీ.. నేను ఏడవ తరగతిలో ప్రేమలో పడ్డానని తన ప్రేమ రహస్యం బయటపెట్టేశారు. మా ఊరు మొగల్తూరులో ఏడవ తరగతి చదివే సమయంలో ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. ఆ అమ్మాయి సైకిల్ తొక్కుతూ వస్తుంటే తననే చూసేవాడినని కానీ.. ఆ అమ్మాయి తనను ముందుకు చూసి రోడ్ పై వెళ్లాలని చెప్పేదని అంటూ చిరు ఎంతో ఫన్నీగా తన ప్రేమకథ గురించి చెప్పారు. దీంతో నాగార్జున, అమీర్ ఖాన్ ఒక్కసారే నవ్వేశారు.