టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దసరా పండుగ సందర్బంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చిరంజీవిని ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి వివాదాలకు దారి తీశాయి. దీంతో మెగా అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు గరికపాటి మాటలను తప్పుపట్టి.. ఆయన గురించి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో కౌంటర్స్ కూడా వేశారు. దీంతో ఈ విషయంపై చిరంజీవి కూడా స్పందించలేదు.
ఈ క్రమంలో గరికపాటి వివాదంపై చిరంజీవి.. గాడ్ ఫాదర్ లేటెస్ట్ సక్సెస్ మీట్ లో స్పందించినట్లు తెలుస్తుంది. అలాగే ఈ వివాదానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడట. గాడ్ ఫాదర్ మెగా విజయం కార్యక్రమంలో భాగంగా చిరు మాట్లాడుతూ.. “గరికపాటి పెద్దవారు. ఆయన నా గురించి చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సినంత అవసరం లేదు” అని చెప్పుకొచ్చినట్లు సమాచారం. దీంతో స్వయంగా చిరంజీవియే ఈ వివాదంపై చర్చించే అవసరం లేదని తేల్చి చెప్పేసరికి.. వివాదానికి ముగింపు పడినట్లేనని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. ఇక ఇదే సక్సెస్ మీట్ లో చిరంజీవి తన తదుపరి సినిమాల గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
‘ప్రస్తుతం నేను లైనప్ చేసిన సినిమాలన్నీ వచ్చే ఏడాది సమ్మర్ వరకు థియేటర్లలో రిలీజ్ అవుతాయి. 2023 మార్చి తర్వాత కొత్త సినిమాల గురించి ఆలోచిస్తాను. ఇక డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ‘మెగా154’ సినిమాలో నా పాత్ర ఫుల్ మాస్ ఉంటుంది. తూర్పు గోదావరి యాసలో నా డైలాగ్స్ బాగా ఎంతెర్తైనింగ్ గా ఉంటాయి. అలాగే మా ఆచార్య మూవీ నిరాశపరించినందుకు బాధపడలేదు. ఆ సినిమా ప్లాప్ అయినందుకు నేను, చరణ్ 80 శాతం రెమ్యూనరేషన్ నిర్మాతలకు తిరిగి ఇచ్చాము. ఇప్పుడు RRR సక్సెస్ కంటే గాడ్ ఫాదర్ విజయాన్నే చరణ్ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడు’ అని చిరు చెప్పారని సమాచారం. మరి ఇకనైనా గరికపాటి వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి!