మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ సాగిస్తుంది. సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన హార్బర్ సెట్ లోనే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ, దేవి శ్రీ ప్రసాద్, చిత్ర నిర్మాతలు సహా సినిమాకి పని చేసిన టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, రవితేజ సహా యూనిట్ సభ్యులు మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు.. చిరంజీవిని అనేక ప్రశ్నలు అడిగారు. ఈ వయసులో సినిమా కోసం ఇంతలా కష్టపడాలా? గడ్డ కట్టే చలిలో అంతలా కష్టపడి నటించాలా? స్టార్ హీరో కాబట్టి డూప్ ని పెట్టుకోవచ్చు కదా’ అని అడిగితే.. కష్టపడాలి తప్పదు అని జవాబిచ్చారు.
ఈ సినిమా కోసం చిరంజీవి ఎంత కష్టపడ్డారో వివరించారు. ఎందుకు కష్టపడ్డారో కూడా వివరించారు. ఒకసారి సినిమాకి కమిట్ అయ్యాక ఎంత కష్టమైనా చేయాల్సిందే, చేతకాకపోతే ఇండస్ట్రీ వదిలి ఇంటికి వెళ్లిపోవాల్సిందే అని కూడా అన్నారు. అలా అయితే హీరోలు రిటైర్ అవ్వడం బెస్ట్ అని చిరు సీరియస్ అయ్యారు. ఏ అనుభవం లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత కష్టమైనా చేసేయాలి అనుకున్నప్పుడు.. ఇంత అనుభవం ఉండి.. కష్టపడకపోతే ఎలా అని, అందుకే తాను ఈ వయసులోనూ కష్టపడతాను అని చెప్పుకొచ్చారు. ఇక పవన్ తో మల్టీస్టారర్ మూవీ ఎప్పుడు చేస్తారు అని ఒక మీడియా మిత్రుడు అడగ్గా.. దానికి చిరంజీవి సానుకూలంగా స్పందించారు.
ఏ హీరోతో అయినా మల్టీస్టారర్ మూవీ చేయడానికి తాను సిద్ధమే అని చిరంజీవి అన్నారు. ‘పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలి. అది అయిన తర్వాత చేస్తాను. బహుశా ఒక 2 సంవత్సరాలు పడుతుందేమో. ఆ తర్వాత ఆలోచిస్తాను’ అంటూ సమాధానమిచ్చారు. అన్నయ్య ఆలోచిస్తాను అన్నారంటే ఖచ్చితంగా జరుగుతుంది అంతే. మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్ లో మూవీ రావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. మరి ఈ మెగా కాంబోకి సెట్ అయ్యే కథ రెడీ చేసే దమ్ము ఏ స్టార్ డైరెక్టర్ కి ఉందో కామెంట్ చేయండి.