మెగాస్టార్ చిరంజీవి.. కొణిదెల శివశంకర్ ప్రసాద్ నుంచి మెగస్టార్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చి.. నిరంతర సాధన, కృషి, పట్టుదలతో.. నేడు మెగాస్టార్‌గా ఎదిగి.. మన ముందు నిలిచారు. అయితే తనకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం వెనక ఎందరో దర్శకులు, నిర్మాతలు ఉన్నారని.. వీరితో పాటు పలువురు జర్నలిస్ట్‌లు కూడా తనపై ఎంతో ప్రభావం చూపారని.. వారి ఇచ్చిన సలహాలు తనకు ఎంతో మేలు చేశాయని తెలిపారు. అంతేకాక రివ్యూలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.
ఇది కూడా చదవండి: Chiranjeevi: రాజమౌళి డైరెక్షన్ లో నటించలేను : చిరంజీవి
జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘‘ప్రాణం ఖరీదు’ సమయంలో నా ఫొటో ఎవరైనా పేపర్‌లో వేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆ సమయంలోనే చెన్నైలోని ఓ జర్నలిస్ట్ తాను పని చేస్తున్న పేపర్‌లో నా ఫొటో వేసి.. నా గురించి రాశారు. అది చూసి చాలా ఆనందపడ్డాను. ఆ జర్నలిస్ట్‌ను పిలిచి థ్యాంక్స్ చెప్పాను. అయితే ఉత్త థ్యాంక్స్ ఏం చెబుతాం అని అనుకుని డబ్బులు చేతిలో పెట్టబోయాను. దానికి ఆ జర్నలిస్ట్ వద్దని చెప్పి… ‘మీ లాంటి నటులను ఎంకరేజ్ చేయడానికి రాశాను. అది నా బాధ్యత’ అన్నారు. ఆయనే దివంగత జర్నలిస్ట పసుపులేటి రామారావు’’ అని చిరంజీవి తెలిపారు.
ఇది కూడా చదవండి: నేను అలాంటి ఎక్స్‌ట్రాలు చేసే రకం కాదు: మెగాస్టార్ చిరంజీవి
‘‘ఆ సంఘటనతో జర్నలిస్ట్‌ల మీద అపారమైన గౌరవం కలిగింది. జర్నలిస్ట్‌ల విషయంలో గౌరవంగా ఉండటానికి పసుపులేటి రామారావే కారణం. అందుకే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను . ఆ తర్వాత నా నట జీవితాన్ని తీర్చిదిద్దిన వారిలో మరి కొందరు జర్నలిస్ట్‌లు కూడా ఉన్నారు. వారే గుడిపూడి శ్రీహరిరావు, ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్. వీళ్లు నాతో మాట్లాడినప్పుడు నా నటన గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసేవారు. అంతేకాదు కొన్ని టిప్స్ కూడా ఇచ్చేవారు. ఇక గుడిపూడి శ్రీహరి.. సితారలో రివ్యూస్ రాసేటప్పుడు కొంచెం కఠినంగా ఉండేవి. ఇదేంటి రివ్యూలో ఇంత కటువుగా చెప్పారు అనుకునేవాడిని. అయితే నా నటనలోని మైనస్‌లను ఆయన ఓ టీచర్‌లా ఎత్తి చూపారు అనిపించేది’’ అని చిరజీవి గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Talasani Srinivas Yadav: ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవి : మంత్రి తలసాని
అలానే ‘‘ఓసారి ఓ రివ్యూలో నటనలో స్పీడ్ ఉండొచ్చు కానీ, మాటలో ఉండకూడదు అని రాశారు. నేను వేగంగా మాట్లాడతాడని తెలిసినా.. సినిమాల్లో ఇబ్బంది కలుగుతోంది అని అనుకోలేదు. రివ్యూ చదివాకా ఆలోచిస్తే.. ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజమే కదా అనిపించింది. దాంతో నా డైలాగ్ మాడ్యులేషన్ మార్చుకున్నాను. అలా జర్నలిస్ట్‌లో నా కెరీర్‌ను మలచుకోవడంలో చాలా సాయం చేశారని’’ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. రివ్యూలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి మెగాస్టార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.