మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఆయన.. ఈ ఏడాదిని వీర లెవల్లో స్టార్ట్ చేశారు. తన తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ జోరు చూపిస్తున్నారు. అస్సలు లేట్ చేయడం లేదు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ షూటింగ్ తో బిజీగా ఉన్న ఆయన.. తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. అప్పట్లో వెంకీ కుడుములతో ఉంటుందని అన్నారు గానీ దాని గురించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. ఇప్పుడదంతా కాదన్నట్లు మరో క్రేజీ ప్రాజెక్టులో చిరు హీరోగా నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. రీఎంట్రీలో చిరంజీవికి ‘ఖైదీ నం.150’ అద్భుతమైన ఆరంభం లభించింది. ఆ తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’ చిత్రాలతో కాస్త తడబడ్డారు. గతేడాది చివర్లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’, ఈ సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ‘భోళా శంకర్’ తర్వాత ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని పలువురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ పక్కాగా వీళ్లు అని ఎవరూ చెప్పట్లేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ డైరెక్టర్స్ సురేందర్ రెడ్డి కొట్టేసినట్లు కనిపిస్తోంది.
పవన్ రీఎంట్రీలో వరసగా సినిమాలు ఒప్పుకొన్నారు. అందులో సురేందర్ రెడ్డి ప్రాజెక్టు కూడా ఒకటి. ఎక్కడా పవన్ కల్యాణ్.. హీరో అని చెప్పనప్పటికీ ఆల్మోస్ట్ అతడే హీరోగా ఈ మూవీ కన్ఫర్మ్ చేశారు. అయితే పవన్ చేతిలో ఉన్న సినిమాలతోపాటు వచ్చే ఏడాది జరగబోయే ఏపీ పాలిటిక్స్ తో బిజీ అయిపోయారు. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పట్లో ఈ సినిమా జరిగే పనికాదు. అందుకే ఈ సినిమాతో పవన్ తో బదులు చిరుని పెట్టి తీయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. గతంలో చిరు-సురేందర్ రెడ్డి కాంబోలోనే ‘సైరా’ వచ్చింది. ఒకవేళ ఈ కాంబో మరోసారి కలిసి పనిచేస్తే మాత్రం ఈసారి బాక్సాఫీస్ కి దబిడి దిబిడి గ్యారంటీ. త్వరలో ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చు. మరి ఈ న్యూస్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.
@KChiruTweets – @DirSurender – Almost confirmed. @UV_Creations – @SRTmovies pic.twitter.com/bTFgJRBFsx
— War Is Peace (@sarathrebel) January 23, 2023