సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. తాజాగా విడుదలైన జైలర్ సినిమా థియేటర్లలో బజ్ క్రియేట్ చేస్తోంది. తలైవా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. తాజాగా విడుదలైన జైలర్ సినిమా థియేటర్లలో బజ్ క్రియేట్ చేస్తోంది. తలైవా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2005లో విడుదలైన ఈ సినిమా నేటికి కూడా ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు ప్రధాన పాత్రలు నటించగా పి.వాసు దర్శకత్వం వహించారు. కాగా త్వరలోనే చంద్రముఖి సీక్వెల్ కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో చంద్రముఖిలో నటించిన చిన్నారి గురించి నెటిజన్స్ వెతుకుతున్నారు.
చంద్రముఖి సినిమాలో అత్తింధోం.. పాట సూపర్ హిట్ అందుకుంది. ఈ పాటలో కనిపించిన ఈ చిన్నారి ముద్దుగా ఆకర్షణీయంగా Child కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ పాప మరెవరో కాదు ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాలు, సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కు ధూరమైన ప్రహర్షిత 2021లో వివాహం చేసుకుంది. కాగా గతేడాది ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. 18 ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ప్రహర్షిత తమిళంలో ఓ కొత్త సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. ఇక సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ఫోటోషూట్లు, కూతురితో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. కాగా చంద్రముఖి సీక్వెల్ కి కూడా పి.వాసు దర్శకత్వం వహిస్తూ ఉండగా హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సందర్భంలోనే నెటిజన్స్ ఆ చిన్నారిని గుర్తు చేసుకుంటున్నారు.