పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయిన రష్మికా మందన్నాకు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. బాలీవుడ్‌లో అయితే భారీ అవకాశాలే లభిస్తున్నాయి. ఇప్పుడు మరో బాలీవుడ్ సీక్వెల్ కోసం రష్మికను సంప్రదించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో ఆమెకు బాగా పాపులారిటీ సంపాదించుకుంది. నేషనల్ క్రష్ అంటూ పిల్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆమెకు వివిధ చలనచిత్ర పరిశ్రమల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్‌తో సికిందర్‌లో నటించింది. ఇప్పుడు మరో సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమా సీక్వెల్ కోసం ఈమె పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రిష్ సినిమా ఇప్పటికి మూడు భాగాల్లో వచ్చింది. ఇప్పుడు క్రిష్ 4 కోసం నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర నిర్మాత రాకేశ్ రోషన్ ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను హృతిక్ రోషన్ స్వయంగా తెరకెక్కించనుండటం విశేషం.
ఈ క్రమంలో క్రిష్ 4 లో కధానాయిక పాత్రకు రష్మిక మందన్నా పేరు విన్పిస్తోంది. చిత్ర నిర్మాతలు ఇప్పటికే ఆమెను సంప్రదించినట్టు సమాచారం. ఈ అంశంపై త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు. క్రిష్ 4 భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ కధనం ప్రకారం క్రిష్ 4 కోసం రష్మిక మందన్నా అంగీకరించినట్టు తెలుస్తోంది.