సాధారణంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కాస్త ఫేమ్ వచ్చిన వారంతా ఏదొక విధంగా టీవీ షోలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అదీగాక యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయినవారు కూడా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఆ విధంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకొని.. ఏకంగా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన బ్యూటీ దీప్తి సునైనా. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వీడియో సాంగ్స్ చేస్తూ ఫేమ్ అయిన దీప్తి.. ‘బిగ్ బాస్ 2’లో పాల్గొంది.
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైన దీప్తి.. బయటికి వచ్చాక పూర్తిగా ప్రైవేట్ సాంగ్స్, ఫోటోషూట్స్ వరకే పరిమితం అయింది. అంతేగాక.. దీప్తి ‘కిరాక్ పార్టీ’ సినిమాతో టాలీవుడ్ లో నటిగా డెబ్యూ చేసిన విషయం విదితమే. అయితే.. లైఫ్ లో లవ్, బ్రేకప్ ఇలా అన్ని దశలను చూశానని చెప్పిన దీప్తి.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించి పర్సనల్, ప్రొఫెషనల్ ఏ విషయమైనా సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటుంది.
ఇదిలా ఉండగా.. ఎంతో కాలంగా దీప్తిని సినిమాలలో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మిలియన్స్ లో ఫాలోయింగ్ కలిగిన దీప్తి.. సినిమాల విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి నిరాశే కలిగిస్తోంది. కానీ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని హ్యాపీ చేసేందుకు అదిరిపోయే గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తోంది దీప్తి. తాజాగా దీప్తి చీరకట్టులో నాభి అందాలను చూపుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో దీప్తి అందాలను చూస్తూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. మరి దీప్తి సునైనా లేటెస్ట్ ఫోటోషూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
