పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తానొక ఫెయిలైన పొలిటీషియన్ అని కామెంట్ చేశారు. రాజకీయంగా తాను ప్రస్తుతానికి ఫెయిల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఎంతోకొంత ప్రయత్నం చేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనేదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్ ప్రసంగం వైరల్‌గా మారింది.
ఇప్పటివరకు రాజకీయ ప్రసంగం వైరల్ అవుతుండగా.. ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ కూడా వైరల్‌గా మారింది. అవును పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక అప్‌డేట్ వచ్చింది. తాను నెక్ట్స్ ప్రాజెక్ట్ సాహో డైరెక్టర్ సుజీత్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఈ సినిమాని డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించబోతోంది. అతి త్వరలోనే పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగంకానున్నారని చెబుతున్నారు. రన్ రాజా రన్, సాహో సినిమాలతో ఇప్పటికే డైరెక్టర్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు పవన్ కోసం భారీ కమర్షియల్ సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి రూ.200 కోట్ల వరకు బడ్జెట్ కూడా కేటాయించబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది.
ట్రిపులార్ సినిమాతో ఇప్పటికే డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్‌తో పవన్- సుజీత్ కాంబోలో గొప్ప కమర్షియల్ సినిమా అనగానే అందరిలో ఆసక్తి నెలకొంది. అటు పవన్ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ సినిమా కథ మరే సినిమాకి రీమేక్ కాదని కూడా చెబుతున్నారు. సుజీత్ పవన్ కోసం ఫ్రెష్ స్టోరీని సిద్ధం చేశాడట. ఏపీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వరకు సమయం ఉండటంతో పవన్ వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల సమయానికి సైన్ చైసిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారట. అలా చూసుకుంటే పవన్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.
ఎందుకంటే అలా చుసుకుంటే వచ్చే రెండేళ్లలో పవన్ నుంచి 3 సినిమాల వరకు వస్తాయి. అవును పవన్ కల్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తన తొలి సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు వర్షన్ ఆఫ్ రాబిన్ హుడ్‌గా పవన్ కల్యాణ్ ఈ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఎలాగైనా 2023లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మార్చి 30 2023న విడుదల చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా కూడా పట్టాలెక్కబోతోంది. ఈ 3 సినిమాలను 2023 చివరినాటికి పూర్తి చేస్తే 2023, 2024 సంవత్సరాల్లో మొత్తం పవన్ నుంచి 3 సినిమాలు వస్తాయి.
We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️
Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK
— DVV Entertainment (@DVVMovies) December 4, 2022