ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే వ్యక్తి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. సినిమాల ద్వారానే కాక తన మాటలతో కూడా ఫేమస్ అయిన బండ్ల గణేష్ తాజాగా నలుగురు ప్రముఖ తెలుగు వ్యక్తుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఈనాడు అధినేత రామోజీ రావు, జస్టిస్ ఎన్వీ రమణపై బండ్ల గణేష్ ఒక ఇంట్రస్టింగ్ ట్విట్ చేశారు. ‘నాకు తెలిసిన నాకిష్టమైన తెలుగు జాతి రత్నాలు’ అంటూ నలుగురి ఫొటోలతో ట్వీట్ చేశారు.
కాగా బండ్ల గణేష్ పవన్‌కళ్యాణ్ ఎక్కువగా అభిమానిస్తారనే విషయం తెలిసిందే. మరి ఈ లిస్ట్‌లో పవన్‌కళ్యాణ్ లేకపోవడంతో చర్చ మొదలైంది. తన స్పీచ్‌లతో పవన్‌పై తనకున్న అభిమానాన్ని కురిపించే గణేష్ ఆయనను ఎలా మర్చిపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
నాకు తెలిసిన నాకిష్టమైన తెలుగు జాతి రత్నాలు 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/7YmcW1gSAg
— BANDLA GANESH. (@ganeshbandla) December 10, 2021