నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సింహ, లెజెండ్ సినిమాల తరువాత ఆ తరహా సినిమా కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణ అభిమానులకు అఖండ తో మాస్ జాతర చూపించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మూవీ దుమ్ము రేపుతుంది. ఇటీవల టికెట్ రేట్లు తగ్గించారు.. కరోనా నిబంధనలు పాటించమన్నారు.. ఇన్ని ఆంక్షలున్నా థియేటర్లలో బాలయ్య ‘అఖండ’ మూవీ రచ్చ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ‘అఖండ’ విడుదల కావడంతో చాలాకాలం తర్వాత థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దండయాత్ర చేస్తుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటుగా యూఎస్ ప్రీమియర్లతో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాగా అఖండ రికార్డు సృష్టించింది. ఏపీలో అదనపు షోలకు క్లియరెన్స్‌లు లేకున్నా, టిక్కెట్ల ధరలను పెంచనప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన అన్ని ఏరియాల్లో బాలకృష్ణ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పే కలెక్షన్స్ వచ్చాయి. తొలిరోజు ఊహించినదానికి మించిన వసూళ్లు నమోదయ్యాయి. తొలిరోజు ఊహించినదానికి మించిన వసూళ్లు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక 4 రోజుల వీకెండ్ కావడంతో కచ్చితంగా ఊచకోత ఖాయంగా కనిపిస్తుంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో.. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో బాలయ్య నటనకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ఆవేశం.. పవర్ ఫుల్ నటన, డైలాగులు, బోయపాటి పవర్ ప్యాక్డ్ కథ, మాస్ అంశాలు, తమన్ మ్యూజిక్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ ప్రధాన హైలైట్స్. అఖండ చిత్రంలో లో శ్రీకాంత్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కూడా కీలక పాత్రలు పోషించారు.
అఖండ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :
నైజాం: 4.39 కోట్లు
సీడెడ్: 4.02 కోట్లు(72 లక్షల హైర్స్)
ఉత్తరాంధ్ర: 1.36 కోట్లు
ఈస్ట్: 1.05 కోట్లు(31 లక్షల హైర్స్)
వెస్ట్: 0.96 కోట్లు(24 లక్షల హైర్స్)
గుంటూరు: 1.87 కోట్లు (1 కోటి హైర్స్)
కృష్ణా: 0.81 కోట్లు
నెల్లూరు: 0.93 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 15.39 కోట్లు (23 కోట్లు గ్రాస్) (2.37 కోట్లు హైర్స్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 1.00 కోట్లు
ఓవర్సీస్: 2.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 18.74 కోట్లు (29.5 కోట్లు గ్రాస్)