‘బిగ్ బాస్ షో’ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది.. ‘సీపీఐ నారాయణ’. బిగ్ బాస్ షో వచ్చిన ప్రతిసారి అయన మీడియా ముందుకు వచ్చి మండిపడుతుంటారు. అసలు బిగ్ బాస్ షో ఏంటి? అయనకు.. ఆ షో మీద ఎందుకంత కోపం ఒకసారి పరిశీలిస్తే.. ఆడ, మగ అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో కంటెస్టెంట్స్ ని.. ఒక బిల్డింగ్ లో ఉంచడం.. అందులో కెమెరాలు పెట్టి, వారు చేసే పనులన్నీ మనకు చూపించడం. ఇదే ‘బిగ్ బాస్ షో’. ఈ షో చూసి విమర్శించే వారికంటే.. ఆనందించే వారే ఎక్కువ.
‘బిగ్ బాస్ షో’ ఒక బ్రోతల్ హౌస్ అని, రెడ్ లైట్ ఏరియా అని సీపీఐ నారాయణ విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య హైకోర్టులో బిగ్ బాస్ షోకి వ్యతిరేకంగా రిట్ పిటీషన్ దాఖలు కావడం.. ఆ షో వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించడంతో నారాయణ మళ్లీ వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ షోని పూర్తిగా బ్యాన్ చేసే బాధ్యతను హైకోర్టు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీపీఐ నారాయణ. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని.. సీపీఐ నారాయణకు కౌంటర్ ఎటాక్ ఇస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ఫేస్ బుక్ పేజ్‌లో సీపీఐ నారాయణను ఏకిపారేస్తూ పోస్ట్ పెట్టారు.
“మీకు నచ్చకపోతే చూడకండి. ఛానల్ మార్చుకోండి. వాకింగ్ చేసుకొండి. లేదూ ఏదైనా పుస్తకం చదువుకోండి. ఏమి ఇల్లీగల్ విషయాలు జరుగుతున్నాయి అని బ్యాన్ చేయాలి? RRR లో మనుషులను పొడవడం చూపించారు, కళ్ల లోనుండి రక్తం కారడం చూపించారు. హింస అంటే అది. బిగ్ బాస్‌లో అటువంటి సన్నివేశాలు ఉన్నాయా?. బూతులు వాడుతుంటే ఎడిట్ చేయమని కోరవచ్చు. అయినా మీకు తెలియని బూతులు ఏమి మాట్లాడుతున్నారు అక్కడ? రాజకీయ నాయకులకు పబ్లిక్ లో వాడటం రాని భాష నా అది? అడల్ట్ కంటెంట్ అంటున్నారు. అంటే అర్ధం ఏమిటి? తెలుగు బిగ్ బాస్‌లో మీకు ఏమి కనిపించింది? ఎవరైనా వివస్త్రగా ఉన్నారా? శృంగారం చూపించారు అంటున్నారా? ఎప్పుడు?.
ఇది కూడా చదవండి: కలిసినప్పుడల్లా అక్కడ ముద్దుపెట్టేవాడు.. చివరికి నా బెస్ట్ ఫ్రెండ్ తో అలా: అషురెడ్డి
“24 గంటల షో పెట్టమన్నారు. ఏమి చూద్దాము అన్న వింత కోరికతో అడిగారు?. అలాంటి ఆలోచనలు మీకే ఎందు వస్తున్నాయి. ఇప్పుడు నిద్ర మానేసి మరీ 24 గంటలూ చూస్తున్నరు? ఎందుకో మరి? చూస్తుంటే మీకు ఏమైనా కనిపించిందో? 90 కెమెరాల సాక్షిగా, వందల మంది ఉద్యోగులు చూస్తూ ఉండగా జరిగే ఆట అని తెలుసుకునే ఇంగితం కూడా లేదా? నైతిక విలువలు అడుగంటి పోతున్నాయంటూ కోర్టుకు పరుగెత్తుకెళ్లారు. ఏ చట్టం ఉల్లఘించబడింది?
“ఇంతకీ కోర్టుల పని చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన తీర్పులు ఇవ్వడమా? లేదా నైతిక అంశాలమీద వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా తీర్పులు ఇవ్వడమా? కొందరకి మాత్రమే నచ్చట్లేదు.. ఎంతో మందికి నచ్చుతోంది. ఇష్టం లేని వారు చూడాలనే నిబంధన లేదుగా? తమ పిల్లలు చూడకూడదు అని అనుకున్న తల్లిదండ్రులు వారి ఇళ్ళల్లో ఆ నియమాలు పాటింపచేస్తారు. మీకు ఏమి పని? మరీ సంస్కారం కోల్పోయి.. మర్యాదస్తులు ఉన్న తెలుగు బిగ్ బాస్ హౌస్ ను వేశ్య గృహం అనడం ఎంత బలుపు? అంటే ఇప్పటి వరకు ఆ షో లో ప్రవేశించిన 30+ మంది ఆడవారిని ఏమి అంటున్నాడు ఈ రాజకీయ నిరుద్యోగి? ఆడవారు వేశ్యలు అయితే అక్కడ ఉన్న మగవారు విటులా? ఖబడ్దార్” అంటూ సీపీఐ నారాయణపై మండిపడ్డారు బాబు గోగినేని. మరి బిగ్ బాస్ షో పై.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియయజేయండి.
ఇది కూడా చదవండి: అషురెడ్డి ఫిజిక్ పై నోరుజారిన నటరాజ్ మాస్టర్?