తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో అందరి మనసు దోచిన యాంకర్ రష్మి గౌతమ్ ఇటీవల ఈ షో నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి జబర్ధస్త్ లోకి రాక ముందే రష్మి గౌతమ్ కొన్ని చిత్రాల్లో నటించింది.. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే జబర్ధస్త్ కామెడీ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిందో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరస ఛాన్సులు వచ్చాయి. కాకపోతే రష్మికి పెద్దా పేరు తీసుకు రాలేకపోయాయి.. కానీ ఈ అమ్మడి క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. ఇక జబర్ధస్ షోలో రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ ఏ రేంజ్ లో నడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ తాము బెస్ట్ ఫ్రెండ్ అని అంటారు ఈ జంట. ఈ మద్య రష్మి తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
జబర్ధస్త్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో ఛాన్సులతో బిజీ అయ్యింది రష్మి గౌతమ్. ప్రస్తుతం ఈ అమ్మడు మాల్దీవులకు వెళ్లి అక్కడ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటికే ఇక్కడ నుంచి పలు ఫోటో షూట్స్, వీడియోలో సోషల్ మాద్యమంలో షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. తాజాగా నడి సంద్రంలో బోల్ పై బ్లూ కలర్ బికినీతో బోట్ లో ప్రయాణిస్తున్నపుడు ఓ విమానం పై నుంచి వెళ్తుండగా దాన్ని చూపిస్తూ వెనక్కి తిరిగి హాట్ గా దర్శనం ఇచ్చింది. వెండితెరపై క్లివేజ్ షో తో కనిపించినప్పటికీ… ఆఫ్ స్క్రీన్ పై మాత్రం చాలా సాంప్రదాయ లుక్ లో కనిపిస్తుంది.
2002లో హోలీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన రష్మి తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2013 లో జబర్ధస్త్ లోకి అడుగు పెట్టిన రష్మి అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు దోచింది. ఆ తర్వాత ఢీ జోడీ, ఢీ 10 లో వంటి రియాల్టీ షోలో యాంకర్ గా సందడి చేసింది. టీవీ షోలతో బాగా పాపులారిటీ సంపాదించిన తర్వాత రష్మి పలు చిత్రాల్లో ఏకంగా హీరోయిన్ ఛాన్సు కొట్టేసింది. ఈ మద్యనే బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా బ్లూ కలర్ బికినీలో రష్మిక అందాల పరువాల చూసి అందాలతో పిచ్చెక్కిస్తుందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి.