వెండితెర కానివ్వండి బుల్లితెర కానివ్వండి ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు చూస్తున్న అగ్ర హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులు ఎవ్వరూ కూడా ఓవర్ నైట్ లో స్టార్లు అయిపోలేదు. వాళ్ళు ఈ స్థాయికి రావడానికి కొన్ని ఏళ్లపాటు కృషి చేశారు. అంత కష్టపడినా కాలగర్భంలో కలిసిపోయిన తారలు ఎంతోమంది ఉన్నారు. అయితే చాలామంది నిలబడి పోరాడి ఇప్పుడు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు చెప్పుకోబోయే సెలబ్రిటీ కూడా ఒకరు. కెరీర్లో ఎత్తు పల్లాలను చూసింది.
తనను ఏ విషయంలో అయితే ట్రోల్ చేశారో అదే విషయాన్ని తన స్ట్రెంత్ గా మార్చుకుంది. ఎదిగి ఇప్పుడు ఒక స్టార్ యాంకర్ గా, నటిగా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా కొనసాగుతోంది. అవును మీరు అనుకున్నది కరెక్టే ఆమె మరెవరో కాదు యాంకర్ భాను శ్రీ. సందర్భం లేకుండా భాను శ్రీ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అనుకోవద్దు. భాను శ్రీకి సంబంధించిన ఒక పాత ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటో ఏంటంటే మిర్చి సినిమాలో అనుష్క పక్కన డార్లింగే ఓరినా డార్లింగే అనే పాటలో సైడ్ డాన్సర్ గా భాను శ్రీ కనిపించింది. అప్పుడు ఎవరూ ఆమెను గుర్తించలేదు.
ఇప్పుడు ఆమె భానుశ్రీ అని తెలియడంతో ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత భాను శ్రీ కెరీర్ కాస్త ఊపందుకుందనే చెప్పాలి. బిగ్ బాస్ తర్వాతే ఆమెకు అవకాశాలు కూడా బాగా వచ్చాయి. బాహుబలి 1, మహానుభావుడు, కాటమరాయుడు వంటి సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఇటీవలే హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. భాను శ్రీ జర్నీ చూసి ఇప్పుడు అంతా ఆమెను తెగ పొగిడేస్తున్నారు. గట్టిగా ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని భాను నిరూపించింది అంటూ మెచ్చుకుంటున్నారు. సైడ్ డాన్సర్ గా కనిపించిన భాను.. ఇప్పుడు యాంకర్ గా, నటిగా రాణిస్తున్న తీరు ప్రశంసనీయం అంటున్నారు.