పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ‘సాహో’ సుజిత్ కాంబినేషన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ లో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, పవన్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో క్షణం తీరిక లేకుండా కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్న హీరో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఇతర నాయకులను ప్రశ్నిస్తూ వారాహి యాత్రతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇటీవల తన తోటి హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ జూలై 28న విడుదలకు సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇటీవలే మొదలైంది. వీటి మధ్యలో ‘సాహో’ సుజిత్ డైరెక్టర్‌గా ‘ఓజీ’ స్టార్ట్ అయింది. పవర్ స్టార్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రకరకాల అప్‌డేట్స్, గాసిప్స్ అండ్ రూమర్లతో మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈమధ్య షూటింగ్‌లో జాయిన్ అయిన యాక్టర్స్ అర్జున్ దాస్, శ్రియా రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు. ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ‘ఓజీ’ లో యాక్ట్ చేయనున్నారట. ఇందులో హీరో తండ్రి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుదని.. పవన్ ఫాదర్‌గా ఆయన కనిపించనున్నారని, మూవీ యూనిట్ ఇప్పటికే బిగ్‌బీని అప్రోచ్ అయ్యారని, త్వరలో ఆయనే అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తారని అంటున్నారు. పవన్ మరో 15 రోజుల పాటు డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అయిపోతుందని సమాచారం. ప్రస్తుతం ఇమ్రాన్ హష్మి మీద ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తున్నారు.