పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. ఇటు వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. మరోవైపు వినోదయ సితం రీమేక్, డైరెక్టర్ సుజిత్ తో ఓజి సినిమాలు కూడా లైనప్ చేశాడు. సో.. త్వరలోనే ఈ సినిమాలన్నీ పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో ముందుగా వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ట్రోల్స్ వినిపిస్తున్నా.. దర్శకుడు ఫ్యాన్స్ కి భరోసా ఇవ్వడం జరిగింది.
ఉస్తాద్ పై ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయంటే.. ఈ సినిమా కూడా తమిళ మూవీకి రీమేక్ కాబట్టి. అవును.. దళపతి విజయ్ – డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన 2016 బ్లాక్ బస్టర్ ‘తేరి’కి ఇది రీమేక్ గా రాబోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ కొత్త కథలతో సినిమాలు చేసి చాలా ఏళ్లయింది. పైగా చేస్తున్నవన్నీ రీమేక్ సినిమాలే కావడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం కూడా ఉంది. తేరి సినిమా ఆల్రెడీ తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో రిలీజ్ అయ్యింది. పైగా అన్ని ఓటిటిలలో, టీవీ ఛానల్స్ లో వారానికి ఓసారి టెలికాస్ట్ అవుతోంది.
ఇప్పటికే జనాలంతా చాలాసార్లు సినిమాని చూసేశారు. అలాంటి సినిమాని మళ్లీ కొత్తగా.. పవన్ కళ్యాణ్ చేయడం అనేది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మించనున్నారు. కాగా.. తేరి సినిమాలో విజయ్ కూతురి పాత్రలో నటి మీనా కూతురు నటించింది. ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ కూతురి పాత్రను అల్లు అర్జున్ గారాలపట్టి.. అల్లు అర్హ పోషించనుందని టాక్ నడుస్తోంది. ఆల్రెడీ అర్హ శాకుంతలం సినిమాలో కూడా నటించింది. సో.. పవన్ కూతురి పాత్ర కోసం అల్లు అర్హ బెటర్ అని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై బన్నీతో కూడా చర్చలు జరిగాయని.. బన్నీ కూడా ఓకే చెప్పాడని సినీవర్గాల సమాచారం. చూడాలి మరి మేకర్స్ ఏం చెప్పనున్నారో! మరి పవన్ కూతురిగా అర్హ ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.