విదేశాల్లో ప్రారంభం అయ్యి.. ఇండియాలో ప్రవేశించి.. ప్రస్తుతం అన్ని ప్రముఖ ఇండస్ట్రీల్లో ముఖ్య రియాలిటీ షోగా నిలిచింది బిగ్ బాస్. ఎన్ని సీరియల్స్, సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్‌లో పాల్గొనడం ద్వారా వస్తుంది. అందుకే చిన్నా, పెద్దా సెలబ్రిటీలు బిగ్ బాస్‌లో పాల్గొనాలని ఆశిస్తారు. అయితే అందరూ అదృష్టంగా భావించే బిగ్ బాస్ తన కొంప ముంచింది అంటున్నాడు ప్రముఖ బుల్లితెర నటుడు అలీ రెజా. బిగ్ బాస్ సీజన్ 3లో అలీ రెజా పాల్గొన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచాడు.
ఇది కూడా చదవండి: అలీతో సరదాగా షోలో బ్రహ్మానందం సీరియస్!
సీజన్‌లో ఏడోవారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు అలీ రెజా. అయితే మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి.. టాప్ 5లోకి దూసుకుని వచ్చినా విజేత కాలేకపోయాడు. ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రంలో కనిపించాడు. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే బిగ్ బాస్ తర్వాత అలీ రెజా బుల్లి తెరకు పూర్తిగా దూరమయ్యాడు. దీని వెనక బలమైన కారణం ఉందన్నాడు అలీ రెజా. తనను ప్రొడ్యూసర్ కౌన్సిల్ బ్యాన్ చేసింది అంటూ సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో నా చెంప పగలగొట్టారు: హీరో వెంకట్
తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి నటుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమిత్ తివారీతో కలిసి గెస్ట్‌గా వచ్చాడు అలీ రెజా. ఈ క్రమంలో వ్యాఖ్యతగా ఉన్న అలీ.. అలీ రెజాను ఉద్దేశించి.. ఈ మధ్యన టీవీలలో కనిపించడం లేదేంటి అని ప్రశ్నించడంతో.. తనని బ్యాన్ చేశారనే విషయాన్ని రివీల్ చేశాడు. ‘‘నాకు అప్పట్లో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ టైంలో చిన్న మిస్టేక్ చేశా.. నాకు ఫోన్ చేసి మీరు వెంటనే ప్రొడ్యుసర్ కౌన్సిల్‌కి రావాలని చెప్పారు. నేను వెళ్లేసరికి అలీ రెజా రెండేళ్లు బ్యాన్ అని అన్నారు. ఆ మాట విన్న తరువాత నాకు సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది’’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ రెజా. అయితే అలీ రెజాపై ప్రొడ్యుసర్ కౌన్సిల్ చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటి.. రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారన్నది తెలియాలంటే.. ఏప్రిల్ 4న ప్రసారం కానున్న ‘అలీతో సరదాగా’ పూర్తి ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో జరిగిన అవమానం బయటపెట్టిన యాక్టర్ సత్యప్రకాష్
ఇక అలీ రెజా సినిమాలు, సీరియల్స్ విషయానికి వస్తే.. 2010 లో ‘పసుపు కుంకుమ’ టీవీ సీరియల్‌లో నటించారు అలీ రెజా. ఆ తరువాత మాటే మంత్రము సీరియల్‌తో క్రేజ్ దక్కించుకున్నాడు. సినిమాల విషయానికి వస్తే.. ముఖ్బీర్ అనే హిందీ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన అలీ రెజా.. ‘అమృతం చందమామలో’, ‘గాయకుడు’, ‘సినీ మహల్’, ‘ధృవ’, ‘నా రూటే సెపరేటు’, ‘వైల్డ్ డాగ్’, ‘మెట్రో కథలు’ వంటి చిత్రాల్లో నటించారు. క్రిష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్‌లో నటించారు అలీ రెజా. ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అలీ రెజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.