ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి నలుమూలలా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతమే కాదు.. భవిష్యత్ లో కూడా టాలీవుడ్ స్థాయి మరింత పెరుగుతుందని.. స్టార్ హీరోలకు కొదవ లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
టాలీవుడ్.. ప్రస్తుతం తెలుగు సినిమా ఖ్యాతి, స్థాయి ప్రపంచవ్యాప్తం అయ్యింది. తెలుగు సినిమాకు గ్లోబల్ స్థాయి ఆడియన్స్ దొరికారు. గతంలో ఎన్టీఆర్- ఏఎన్నార్, కృష్ణ లు తెలుగు సినిమాకి ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేశ్ వంటి స్టార్లు తెలుగు సినిమా స్థాయిని మరింత విస్తృతం చేశారు. తర్వాత వారి నట వారసత్వాన్ని పవన్ కల్యాణ్– మహేశ్ బాబు మరో మెట్టు ఎక్కించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, నాగచైతన్య, అఖిల్ వంటి యంగ్ హీరోలు తాతలు, తండ్రుల వారసత్వాన్ని, నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా పాన్ ఇండియా స్టార్లుగా ఎదుగారు. అయితే తర్వాతి జనరేషన్ కూడా రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులు, స్టార్లు, స్టార్ హీరోలు ఉన్నారు, వస్తున్నారు, వస్తూనే ఉంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ వరకు ప్రతి ఒక్క హీరో టాలీవుడ్ రేంజ్ ని మరోస్థాయికి తీసుకెళ్లిన వాళ్లే. ఇండస్ట్రీలోకి ఇంకా కొత్త కొత్త స్టార్లు వారసులు కూడా వస్తూనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ తర్వాతి జనరేషన్ కోసం కూడా స్టార్లు దొరికేశారని చెబుతున్నారు. చెప్పడం మాత్రమే కాదు.. అభిమానులు వారి చిత్రాలను వైరల్ చేస్తూ తెగ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో స్థాయిని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్తారంటూ ఆకాంక్షిస్తున్నారు.
ఆ స్టార్లు మరెవరో కాదు.. పవన్ కల్యాణ్ తనయుడు అఖిరానందన్, మహేశ్ బాబు తనయుడు గౌతమ్. అవును ఇప్పుడు అఖిరా- గౌతమ్ ఫొటోలను నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఈ-ప్రిక్స్ ఈవెంట్ హాజరైన వీళ్ల పిక్స్ ని షేర్ చేస్తూ ఫ్యూచర్ స్టార్లు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఫాలోయింగ్ విషయంలో పవన్ కల్యాణ్- మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి హీరో పిల్లలు హీరోలు కావాలని ఫ్యాన్స్ కచ్చితంగా కోరుకుంటారు. ఇప్పటికే అఖిరా- గౌతమ్ పేరిట ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. వీళ్లు స్టార్లు అవ్వడానికి అన్నీ అవకాశాలు ఉన్నాయి. పైగా హైట్, ఫిజిక్, పర్సనాలిటీ విషయంలో వాళ్లు హీరో మెటీరియల్స్ అని ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు.
Formula E రేస్ చూడటానికి వచ్చిన యంగ్ పవర్ స్టార్ | Akira Nandan At Formula E Race | Hyderabad EPrix#AkiraNandan #PawanKalyan #RamCharan #formulaerace #FormulaE #f1race #Hyderabad #Prime9News pic.twitter.com/N1Zs03liOW
— Prime9News (@prime9news) February 11, 2023
టాలీవుడ్ కు స్టార్ హీరోలు దొరికేశారంటూ కామెంట్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే వీళ్లు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. వన్ సినిమాలో గౌతమ్ చైల్డ్ ఆర్టిస్టుగా గౌతమ్ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత స్టడీస్ దృష్టి పెట్టాడు. ఇంక అఖిరా కూడా ఇష్క్ వాలా లవ్ అనే సినిమాలో చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత చదువుల వైపు వెళ్లిపోయాడు. ఇప్పుడు వీళ్లు హీరోలు కావాలంటూ ఫ్యాన్స్ డిమాండుల మీద డిమాండులు చేస్తున్నారు. వీళ్లు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కుమారుడు, అల్లు అర్జున్ తనయుడు, రవితేజ కుమారుడు ఇలా చాలా మంది స్టార్ హీరోల పిల్లలు అంతా హీరోలుగా మారిపోతే. టాలీవుడ్ లో తర్వాతి తరానికి కూడా స్టార్ హీరోలకు అస్సలు కొదవే లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
PRINCE Gautham Ghattamaneni 💥💥#SSMB28 pic.twitter.com/yFszeRp3aV
— Avinash DHFM (@BabuFanForever) February 11, 2023