మాజీ విశ్వ సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నాసిక్ లో ఆమె పేరుతో ఉన్న భూమికి పన్ను చెల్లించనందుకుగాను నాసిక్ తాసిల్దార్ ఈ నోటీసులు పంపారు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని సిన్నార్‌లో ఐశ్వర్య రాయ్ పేరిట హెక్టారు భూమి ఉంది. ఆమె ఈ భూమికి సంబంధించి ఏడాది కాలంగా పన్ను చెల్లించలేదు. దీంతో జిల్లా యంత్రాంగంలోని సంబంధిత అధికారులు ఐశ్వర్య రాయ్ కు నోటీసులు పంపారు.
నోటీసుల ప్రకారం.. ఐశ్వర్య రాయ్ రూ.21,960 భూమి పన్ను చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. మార్చిలోపు చెల్లించకపోతే, మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం, 1966లోని సెక్షన్ 174 ప్రకారం ఐశ్వర్యపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ నోటీసులపై ఐశ్వర్య రాయ్ స్పందించలేదు. ఆమెతో పాటు పన్ను చెల్లించని మరో 1200 మందికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం. జనవరి 9న నోటీసులు జారీ చేశారు. వీరు పన్నులు చెల్లించక పోవటం వల్ల రూ.1.11 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. మార్చిలోగా వారంతా పన్ను చెల్లించాల్సిందిగా ఈ నోటీసులలో పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి చివరి నాటికి పన్ను బకాయిలు వసూలు చేయాలని మహారాష్ట్రలోని భూ రెవెన్యూ విభాగానికి ఆదేశాలు అందాయి. అందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే, 1200 మంది జాబితాలో ఐశ్వర్యతోపాటుగా మరికొంతమంది సెలబ్రెటీలు, వ్యాపారస్తుల భూములు కూడా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఐశ్వర్య రాయ్ గతేడాది మణిరత్నం నిర్మించిన పొన్నియన్ సెల్వన్ లో కనిపించింది. కార్తీ, విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష తదితరులు నటించిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దీని సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్-2, ఈ ఏడాది ఏప్రిల్ 2023లో విడుదల కానుంది.
Actress Aishwarya Rai Bachchan received a notice from the Maharashtra government authority over non-payment of non-agricultural tax for her land parcel in Sinnar district near Nashik city.
Read more↘️https://t.co/Y3jTyK8c3N#AishwaryaRaiBachchan #Maharashtra #Taxes
— Moneycontrol (@moneycontrolcom) January 17, 2023