ఈ మధ్యకాలంలో థియేట్రికల్ గా అలరించిన సినిమాలు ఓటిటిలలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఎలా ఆడినా.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సక్సెస్ అవుతాయి. ఇంకొన్ని థియేటర్స్ లో ఆడితే ఓటిటిలో నిరాశపరుస్తుంటాయి. ఇవన్నీ ఎప్పుడూ జరిగేవే. కానీ.. థియేట్రికల్ అయినా, ఓటిటిలోనైనా సినిమాలు ఆడాలంటే.. ఆడియెన్స్ ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. హీరో.. సాంగ్స్.. ట్రైలర్.. కథాకథనాలు.. ఇలా ఏదొక ఎలిమెంట్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాల్సి ఉంటుంది. అయితే.. సినిమా హైప్ విషయంలో హీరో, ట్రైలర్, సాంగ్స్ ఎప్పుడూ వినిపించేవే.
ఒక సినిమాపై భారీ హైప్ రావడానికి కారణాలు ఎన్ని ఉన్నా.. హీరోయిన్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. ఆ విషయాన్నీ రీసెంట్ గా ప్రూవ్ చేసింది యంగ్ హీరోయిన్ శ్రీలీల. హీరోల క్రేజ్ తో సినిమాలు ఆడటం మామూలే. కానీ.. హీరోయిన్ క్రేజ్ తో అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు ఆడుతుంటాయి. అలాగని పూర్తిగా హీరోయిన్స్ క్రేజ్ తో పాటు హీరో ఇమేజ్ కూడా తోడవుతుంది. కానీ.. ఇటీవల విడుదలై గ్రాండ్ సక్సెస్ అయిన ధమాకా సినిమా విషయంలో రవితేజ పేరు ఎంత వినిపించిందో.. హీరోయిన్ శ్రీలీల పేరు కూడా అంతే వినిపించింది. పైగా సినిమాలోని అన్ని మాస్ సాంగ్స్ లో తన ఎనర్జిటిక్ డాన్స్ తో పాటు క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.
ఇక ధమాకా మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైంది. ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకొని.. హీరోయిన్ శ్రీలీల పెర్ఫార్మన్స్ కి మంచి అప్లాజ్ లభిస్తోంది. పెళ్లిసందడి తర్వాత ధమాకాతో సెకండ్ హిట్ అందుకున్న ఈ భామ.. ఏకంగా ఐదు సినిమాలను లైనప్ చేసింది. ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ మూవీ, అనగనగా ఒక రాజు, జూనియర్, రామ్ – బోయపాటి మూవీలలో నటిస్తోంది. అయితే.. కేవలం రెండు సినిమాలతో హీరోయిన్ గా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది శ్రీలీల. డాన్స్, లుక్స్, గ్లామర్, యాక్షన్ ఇలా అన్నివిధాలా ఇండస్ట్రీకి మరో బ్యూటీ దొరికినట్లే అని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి శ్రీలీల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.