ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల వరుస విడాకులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరి తరువాత ఒకరు.. తమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలుపుతూ అభిమానులకు షాకులు ఇస్తున్నారు. బాలీవుడ్తా, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ విడాకులు ఇచ్చుకుంటున్నారు. హిందీ గ్లామర్ ఫీల్డులో మరో జంట విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో బుల్లితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి సురభి తివారీ.. నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నానంటూ ఆవేదన చెందుతుంది. బాలీవుడ్ బుల్లితెరపై వచ్చిన ఘర్ జమై మరికొన్ని సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. సురభి ఇప్పుడు తన భర్త సిన్హా నుండి విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరి వివాహం జరిగినప్పటి నుంచి అత్తగారి వేధింపులు ఘెరంగా ఉండేవని ఆరోపించింది. అలాగే సురభి తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని భర్త, అత్త, ఆడబిడ్డపై గృహ హింస కేసు పెట్టింది.
ఈ మద్య ఓ మీడియా ఛానెల్ లో మాట్లాడిన సురభి.. ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది ఎంతో ఆనంద సమయం. కానీ తన జీవితంలో మాత్రం ఇది వ్యతిరేకంగా ఉందని.. నా భర్త ప్రవీణ్ గతంలో లేడని.. పూర్తిగా మారిపోయాడని గ్రహించానని తెలిపింది. తన కెరీర్ ముంబైలో మొదలైంది.. అక్కడ ఉంటేనే తనకు సరైన అవకాశాలు వస్తాయని.. ఈ విషయం ముందుగా తన భర్తకు చెప్పానని.. కానీ పెళ్లి తర్వాత మాట తప్పాడని చెప్పింది. అత్త, ఆడబిడ్డ తో కలిసి భర్త తనను ప్రతిరోజూ ఏడిపిస్తూ ఉన్నారని.. తాము ముంబైకి రానని తెగేసి చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదే విషయమై ప్రవీణ్ తో ఎప్పుడు వివాదాలు నడుస్తూనే ఉన్నాయంటూ.. అందుకే తాము స్నేహ పూర్వకంగా విడిపోవాలని అనుకున్నాను. కానీ ప్రవీణ్ మాత్రం తనకు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదని.. అలా అని తాను చెప్పిన విషయానికి అంగీకారం కూడా తెలపడం లేదని.. అందుకే అతనిపై న్యాయపరమైన మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను త్వరలో విడాకుల కోసం దాఖలు చేస్తానని ఆమె పేర్కొన్నారు.
నాకు పిల్లలు అంటే ఎంతో ప్రేమ.. కానీ పెళ్లయిన తర్వాత ప్రవీణ్ మాత్రం బిడ్డను కనేందుకు నిరాకరిస్తూ వచ్చాడని తెలిపింది. అంతేకాదు బాడీ షేమింగ్ చేస్తూ.. సరైన ఆహారాన్ని ఇవ్వకుండా నిషేదించడానికి ప్రయత్నించాడని, ఒకరోజు తాము ఎయిర్ పోర్ట్ కి వెళ్లినపుడు ఏదైనా తినడానికి నాకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడని అన్నారు. నా బంగారు, వెండి ఆభరణాలు మొత్తం అత్తగారు తీసుకున్నారని.. వాటిని పొందే హక్కు తనకు ఉందని.. అందుకోసం తవరకైనా పోరాడతానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ టీవీ రంగంలో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.