ప్రస్తుతం చాలా మంది సినిమాల్లో స్టార్ హీరో, హీరోయిన్లగా కొనసాగుతున్నారు. వారు ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కృషి చేసి ఉంటారు. వారు ప్రస్తుతం అనుభవిస్తున్నా స్టార్ స్టేటస్ గురించే ప్రతి ఒక్కరి తెలుసు. అయితే సెలబ్రిటీలు కాకముందు వారు పడిన కష్టాలు ఎవరికి తెలియదు. చాలా మంది హీరో, హీరోయిన్లు సినిమాల్లోకి రాకముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని కష్టాలు ఎదుర్కొన్ని, ధైర్యంగా నిలబడి సినిమాలో స్టార్ హోదాను అందుకున్నారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకరు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతున్న ఈ అమ్మడి జీవితంలో పేదరికం అనే మరో కోణం కూడా ఉందట. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. తన బాల్యంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది.
రష్మిక.. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. అనంతరం ‘చలో’ సినిమాతో ఈ భామ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత గీతాగోవిందం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించింది. ఆ తరువాత పలు సినిమాలో కూడా నటించింది. ఇక గత ఏడాది విడుదలైన పుష్ప సినిమా తో ఈ అమ్మడి రేజ్ మారిపోయింది. ఏకంగా నేషనల్ క్రష్ గా మారింది. ఈ క్రమంలో బాలీవుడ్ లో సైతం మంచి ఆఫర్ల అందుకుంది. కోట్లలో పారితోషకం డిమాండ్ చేసే స్థాయికి ఈ అమ్మడు చేరుకుంది. ఇటీవల బాలీవుడ్ లో నటించిన ‘గుడ్ బై’ మూవీలో నటిగా మంచి మార్కులు సంపాదించింది.
అయితే ఆ మూవీకి ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలో నటిస్తోంది. వాటిపైనే ఈ అమ్మడు ఆశపెట్టుకుంది. తెలుగులో నటించనున్న పుప్ప-2 సినిమా మినహా మరో చిత్రం లేదు. తమిళ్ లో విజయ్ కి జోడిగా ‘వారసుడు’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ భామకు చాలా కీలకం. ఇలా ప్రస్తుతం నేషనల్ క్రష్ గా కొన్నసాగుతున్న రష్మిక జీవితంలో పేదరికం కూడా అనుభవించిందట. తన బాల్య జీవితం చాలా కష్టంగా ఉండేదట. ఈ విషయాన్ని ఈ బ్యూటీనే స్వయంగా చెప్పింది. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలానే తన బాల్య జీవితం గురించి తెలిపింది.
రష్మిక మాట్లాడుతూ..”నా చిన్నతనంలో మా కుటుంబం చాలా ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంది. నాన్న ఆదాయం లేక చాలా కష్టాలు అనుభవించాము. ఇంటి అద్దె చెల్లించలేక రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారాల్సిన దుస్థితి ఉండేది. నాన్న నాకు ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారు. ఇక బయట ఏమైన ఫంక్షన్లకు వెళ్లాలన్నా ఆలోచించే వాళ్లం. మేము ఎక్కడికైన షికారు వెళ్లాలంటే బయటపడే వాళ్లం. కారణం అందుకు కారణం.. అంత ఆర్థిక స్థోమత లేకపోవడం” అని రష్మిక.. తన బాల్య పేదరికాన్ని గుర్తు చేసుకుంది.