నటీనటుల సినీ కెరీర్ విషయంలో కొన్ని సినిమాలు కీలక మలుపు తిప్పుతాయి. అలా కొన్ని సూపర్ హిట్ సినిమాలతో అనేక మంది హీరో, హీరోయిన్లు స్టార్ హోదాలను అందుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. అయితే ఇలా నటీనటుల కెరీర్ తో పాటు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టించిన సినిమాల విషయంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా ఆ సినిమాలను ఒక హీరో కోసం ప్రయత్నిస్తే మరో హీరోకు అవకాశం రావడం. హీరోయిన్ గా ఒకరి ఆఫర్ వస్తే వివిధ కారణలతో ఆ ఛాన్స్ వేరే వారికి వెళ్లడం జరుగుతుంది. చివరకు అల తాము వదులుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకోవడంతో తాము పెద్ద తప్పు చేశామని వాటిని రిజెక్ట్ చేసిన హీరో హీరోయిన్లు బాధపడుతుంటారు. అలాంటి వారిలో పార్వతి నాయర్ ఒకరు. తాను అర్జున్ రెడ్డి మూవీ ఆఫర్ ను వదులుకుని పెద్ద తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
సంచలన నటిగా ముద్ర వేసుకున్న మలయాళీ భామ పార్వతీ నాయర్ వివిధ భాషల్లో నటిగా రాణిస్తున్నారు. ‘యాంగ్రీ బేబీస్ ఇన్ లవ్’ అనే మలయాళ సినిమాతో వెండితెరకి పార్వతి పరిచయం అయింది. ఆ తరువాత వరుసగా పలు మలయాళ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. అంతేకాక ‘స్టోరీ కథే’ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలానే తమిళంలో ఉత్తమ విలన్, మాలై నేరుత్తు మైకం, ఎంకిట్ట మోదాదే, నిమిర్ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఇలా మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తూ బాగా రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఓ విషయంలో ఆసక్తికరమైన వాఖ్యాలు చేసింది. అర్జున్ రెడ్డి సినిమాను వదులుకుని సరిదిద్దుకోలేని తప్పు చేశాని ఆమె వాపోయారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఏ రంగానికి చెందిన వారికైనా అదృష్టం చాలా ముఖ్యమని ఆమె తెలిపింది. అయితే అది కూడా జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుందని, అప్పుడే తలుపు తీయాలని అన్నారు. తాను కూడా అలా తలుపు తట్టిన అదృష్టాన్ని మిస్ చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా తాను నటించాల్సి ఉందని, అయితే అందులోని లిప్ లాక్, రొమాన్స్ సన్నివేశాల ఎక్కువగా ఉన్నాయనే కారణంతో తాను రిజెక్ట్ చేసినట్లు ఆమె పేర్కొంది. అయితే ఆ ఆఫర్ ను వదులుకోకూడదని ఆ చిత్రం చూసిన తరువాత చాలా బాధపడ్డాని ఈ భామ తెలిపింది. నిజానికి అర్జున్ రెడ్డి సినిమా అనే ఓ అందమైన ప్రేమకథ చిత్రమని ఆమె తెలిపింది.
అర్జున్ రెడ్డి సినిమాను వదులుకుని తాను పెద్ద తప్పు చేశాననే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. ఇక ఆమె ఇతర సినిమాల విషయం గురించి మాట్లాడుతూ… ఉత్తమ విలన్ సినిమాలో కమల్ హాసన్ తో కలిసి నటించడం తన అదృష్ణమని, ఆ ఆనుభవాన్ని తాను జీవితాంతం మర్చిపోలేనని ఈ అమ్మడు తెలిపింది. కాగా ఒకే తరహా కథా పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం తనకు ఇష్టం ఉండదని పార్వతీ నాయర్ పేర్కొంది. ప్రస్తుతం ఆలంబన, రుబం అనే సినిమాలో నటిస్తోంది. మరి.. అర్జున్ రెడ్డి సినిమాపై విషయంలో పార్వతి నాయర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.