పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పదేళ్ల పాటు ఒక్క హిట్ కొట్టకపోయినా బాక్సాఫీస్ వద్ద ఆయన స్టామినా ఎక్కడా తగ్గలేదు. ఫ్లాపులతో బాక్సీఫీస్ రికార్డులు క్రియేట్ చేసిన ఘనత. రిలీజ్‌కి ముందే పైరసీ జరిగిన సినిమాతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. రియల్ లైఫ్ హీరోగా నిరూపించుకున్న సందర్భాల్లో ఎన్నో. ఇప్పుడు నేరుగా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా మారిన విషయం తెలిసిందే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తానంటూ ప్రజల్లోకి వెళ్లున్నారు. సినిమాలు చేయగా వచ్చిన సొంత డబ్బుని ప్రజా సేవకోసం వినియోగించడం చూస్తూనే ఉన్నాం.
ఇలా చెప్పుకుంటూపోతే పవన్ కల్యాణ్ గురించి చాలానే ఉన్నాయి. అయితే పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎలా ఉంటారో తెలుసు, సాధారణ వ్యక్తిగా ఎలా ఉంటారో తెలుసు. కానీ, చాలామందికి తెలియని విషయం సినిమా సెట్స్ లో ఎలా ఉంటారు? తోటి కళాకారులతో ఎలా మాట్లాడతారు? ఎంత సరదాగా ఉంటారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాలను నటి జ్యోతి ప్రేక్షకులతో పంచుకుంది. “పవన్ కల్యాణ్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటారు. షూటింగ్ ఉంది అంటే అందరూ ఎంతో జోవియల్ గా ఉంటారు. పవన్ కల్యాణ్ అయితే నా మీద చిన్న చిన్న కవితలు రాసేవారు. నీ వాలు జడ అని వర్ణిస్తూ కవితలు రాసేవారు. వాటిని చూడగానే నేను ఎంతో స్పషల్ గా ఫీలయ్యే దాన్ని. నా గురించి ఒక పెద్ద హీరో ఇలా రాశారు అనుకునే దాన్ని. పవన్ కల్యాణ్‌తో సినిమా అంటే అప్పట్లో ఏం అనిపించలేదు. ఇప్పుడు ఒక ఛాన్స్ వస్తేనా” అంటూ జ్యోతి అప్పటి సినిమా ముచ్చట్లను పంచుకుంది.
అదే ఇంటర్వ్యూలో తన జీవితం గురించి కూడా చాలా విషయాలు వెల్లడించింది. “నేను ఎప్పుడూ ఎవరు ఏమనుకుంటారు అనే విషయం గురించి ఆలోచించను. నా ఒపినీయన్ ని నేను చెప్తాను. అయినా నా జీవితం గురించి జడ్జ్ చేయడాని వాళ్లెవరు. ఏ విషయం అయినా నా వేలో నేను కన్వే చేస్తాను. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నాను. నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడిని చూసుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను. నా మాజీ భర్త కొడుకు పేరు మీద చిల్లి గవ్వకూడా ఇవ్వలేదు. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అతను మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నాడు. అతనికి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు” అంటూ నటి జ్యోతి తన వ్యక్తిగతం జీవితం, విడాకుల గురించి కూడా వెల్లడించింది.
ఇంక జ్యోతి సినిమాల విషయానికి వస్తే.. ఎన్నో అద్భుతమైన రోల్స్ లో జ్యోతి నటించింది. కొన్ని గ్లామర్ రోల్స్ కాగా.. మరికొన్ని మెసేజ్ ఓరియంటెడ్, లీడ్ రోల్స్ లో కూడా తన సత్తా చాటింది. ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గతంలో అయితే ఈ రోల్ జ్యోతి కోసమే అనే విధంగా స్పెషల్‌గా క్రియేట్ చేసేవాళ్లు. అయితే వెండితెరపై ఆమె ప్రభావం తగ్గిపోయిన విషయం తెలిసిందే. కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం కావడం, సీనియర్ల కంటో తక్కువ ఖర్చుతో జూనియర్స్ దొరుకుతుండటం కూడా వారికి అవకాశాలు తగ్గిపోవడానికి కారణంగా చెప్పొచ్చు. అయితే ఇప్పటికీ ఆమె మార్క్‌ని ఇండస్ట్రీలో కొనసాగిస్తూనే ఉందని చెప్పాలి.