గౌతమి భర్తతో మనస్పర్థల కారణంగా వేరుపడ్డారు. తర్వాత ఆమె కమల్ హాసన్‌తో రిలేషన్‌లో ఉన్నారన్న ప్రచారం ఉంది. గౌతమి ఓ కూతురు ఉంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గౌతమి.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మాతృభాష తెలుగులోనే కాదు సౌత్‌లో కూడా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన అతి కొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో గౌతమి ఒకరు. 1980, 1990లలో గౌతమి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. ఇండియాలోని అందరు టాప్ హీరోలతో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే ఆమె ఓ ప్రముఖ వ్యాపార వేత్త సందీప్ భాటియాతో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ 1998లో వివాహం చేసుకున్నారు. అయితే, వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
1999లో మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇద్దరూ వేరు పడే సమయానికి ఈ దంపతులకు సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. ఇక, అప్పటినుంచి సుబ్బలక్ష్మి తల్లి వద్దే ఉంటోంది. సుబ్బలక్ష్మి 1999లో పుట్టింది. ప్రస్తుతం ఆమె వయసు 23 సంవత్సరాలు. ప్రస్తుతం సుబ్బలక్ష్మికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుబ్బలక్ష్మి తన అందంతో ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు, సెలెబ్రిటీలు.. ‘‘ సుబ్బలక్ష్మి అచ్చం మాధురి దీక్షిత్‌లా ఉంది’’..‘‘ సినిమాకు ఓ మంచి హీరోయిన్ దొరికింది’’.. ‘‘ ఈమె అచ్చం నటి సుకన్యలాగా ఉంది’’..
‘‘ గౌతమి కూతురు చాలా అందంగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, సుబ్బలక్ష్మి భాటియాను ఇంట్లో అందరూ ముద్దుగా సుబ్బు అని పిలుస్తుంటారు. ఆమె ఆంధ్రప్రదేశ్, నిడదవోలు పట్టణంలోని తాడిమళ్ల గ్రామంలో జన్మించారు. తర్వాత తల్లితో పాటు చెన్నైలో స్థిరపడ్డారు. సుబ్బలక్ష్మి ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’లో ద్రువ్ విక్రమ్‌కు జంటగా నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, అవి కేవలం పుకార్లు మాత్రమేనని గౌతమి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తన కూతుర్ని సినిమాల్లోకి తీసుకువచ్చే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. మరి, సుబ్బలక్ష్మి ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.