సినీతారలు సినిమాల విషయంలో కాకుండా అప్పుడప్పుడు వ్వ్యక్తిగత సమస్యల కారణంగా వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు వారి పెళ్లి, విడాకులు, భర్తతో గొడవలు వలన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే.. ఎప్పుడూ సోషల్ మీడియాకు దూరంగా ఉండే ప్రముఖ కన్నడ నటి చైత్ర హళ్లికేరి.. తాజాగా వ్యక్తిగత సమస్యల కారణంగా పోలీసులను ఆశ్రయించి వార్తల్లో నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. నటి చైత్ర హళ్లికేరి పర్సనల్ బ్యాంకు ఖాతాను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. తన భర్త బాలాజీ, మామ పోతురాజ్ పై మైసూర్ లోని జయలక్ష్మీపురం పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు నటి చైత్ర భర్త, మామలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మంగళవారం తెలిపారు. ఈ క్రమంలో.. తనకు తెలియకుండానే తన బ్యాంకు అకౌంట్ ను వాడుకోవడమే కాకుండా, గోల్డ్ లోన్ తీసుకున్నారని నటి చైత్ర ఫిర్యాదులో పేర్కొంది.
అదేవిధంగా సదరు బ్యాంక్ మేనేజర్ కూడా భర్త, మామతో కుమ్మక్కయ్యాడని తెలిపింది. ఈ విషయంపై ఇద్దరినీ నిలదీసి అడిగితే హింసించారని, వారినుండి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఇక గతంలో కూడా నటి చైత్ర తన భర్త బాలాజీ తనపై ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. చివరిగా చైత్ర భర్త బాలాజీ, మామలపై పోలీసులు ఐపీసీ 468, 406, 409, 420, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. నటి చైత్ర హళ్లికేరి కన్నడ ఇండస్ట్రీలో ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవి’ సినిమాల్లో నటించింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.