బాలీవుడ్ లో కహోనా ప్యార్ హై మూవీతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటి అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘కహో నా ప్యార్ హై’మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. బాలీవుడ్ లో నటిస్తూనే తెలుగు, తమిళంలో ఛాన్సులు దక్కించుకుంది. పవన్ కళ్యాన్ నటించిన బద్రీ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే కొన్ని కారణాల వల్ల చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ మద్య అమీషా పటేల్ చెక్ బౌన్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుపై రాంచీ కోర్టులో పలుమార్లు విచారణ జరుగుతూ వస్తుంది. తాజాగా చెక్ బౌన్స్ కేసులో నటి అమీషా పటేల్ కి కోర్ట్ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
2000 సంవత్సరాలో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అమీషా పటేల్. పూరి జగన్నాధ్ తెలుగులో ఆమెకు బద్రి మూవీలో ఛాన్సు ఇచ్చాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ అయ్యింది.. ఆ తర్వతా నరసింహుడు, నాని, పరమవీర చక్ర మూవీలో ఛాన్సు దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. గత కొంత కాలంగా అమీషా పటేల్ ని చెక్ బౌన్స్ కేసు పట్టి పీడిస్తుంది. ఆ మద్య ఈ కేసులో రాంచి సివిల్ కోర్టులో లొంగిపోయింది.. తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
గతంలో ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త అయిన అజయ్ కుమార్ రూ.2.5 కోట్లు అప్పగా తీసుకుందని.. సినిమా మాత్రం పూర్తి చేయలేదని, తిరిగి డబ్బు ఇవ్వమని కోరితే తప్పించుకుంటుందని ఆమెపై చెక్ బౌన్స్ కేసు వేశారు. ఇప్పుడు అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 కోట్లు ఇప్పించాలని కోర్టులో పిటీషన్ వేశారు. పిటిషనర్ అజయ్ కుమార్ సింగ్ తరుపున సాక్షిగా కంపెనీ మేనేజర్ టింక్ సింగ్ విచారణకు హాజరు కాగా, అమీషా పటేల్ తరుపు న్యాయవాది గైర్హాజరయ్యారు. దీంతో ఆమె న్యాయవాది కోసం కొంత సమయం కోరగా.. జ్యుడిషియల్ మెజిస్ర్టేట్ డీఎన్ శుక్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు అమీషా పటేల్ కి కోర్టు రూ.500 జరిమానా విధించింది. తదుపరి విచారణ ఆగస్టు 7కి వాయిదా వేసింది.