తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు మురళీ మోహన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వలేదు. తనపని తాను చేసుకుంటూ చాలా కూల్ గా జీవితాన్ని గడుపుతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో పాత తరం హీరోల్లో ఒకరు మురళీ మోహన్. వెండితెరపై హీరోగానే కాదు.. నిర్మాతగా, జయభేరి గ్రూపు అధిపతిగా వ్యాపార రంగంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తరుపు నుంచి ఎంపీగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచారు. ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కెరీర్ కొనసాగించిన వారిలో మురళీ మోహన్ ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి శ్రీదేవి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ లో ఒకప్పుటి హీరోలు చాలా మంది వరకు హీరోయిన్లతో ఎఫైర్లు ఉండేవని తెగ వార్తలు వచ్చేవి. కానీ సీనియర్ నటుడు మురళీమోహన్ కి మాత్రం నాటి తరం హీరోల్లో శ్రీరామచంద్రుడు అనే క్లీన్ ఇమేజ్ ఉంది. తనకు ఆ బిరుదు ఇచ్చింది ఎవరో కాదు.. స్వయంగా ఏఎన్నార్ అంటున్నారు మురళీ మోహన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది.. ఇండస్ట్రీలో నాకు ఎవరితోనూ ప్రేమ వ్యవహారాలు లేవు.. అండర్ హ్యాండ్ డీలింగ్స్ కూడా లేవు. రియల్ లైఫ్ లో నా క్యారెక్టర్ గురించి తెలిసిన నాగేశ్వరరావు మా ఇండస్ట్రీలో శ్రీరామ చంద్రుడు ఎవరైనా ఉన్నారు అంటే.. ఒక్క మురళీ మోహన్ మాత్రమే అని సర్టిఫికెట్ ఇచ్చారు.. దాంతో నేను మరింత జాగ్రత్తగా ఉన్నాను’ అని అన్నారు.
అతిలోక సుందరి శ్రీదేవితో మీ పెళ్లి గురించి అప్పట్లో చర్చలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ ఉందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘శ్రీదేవి తల్లికి నా విషయంలో మంచి అభిప్రాయం ఉంది.. కుర్రాడు బుద్దిమంతుడు.. ఎలాంటి చెడు అలవాట్లు లేవు, బాగున్నాడు.. మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారట.. అంతకు మించి ఏమీ లేదు’ అన్నారు. సెలబ్రెటీలు అన్న తర్వాత చిన్న విషయం పెద్దగా చేస్తుంటారు.. ఈ క్రమంలో వచ్చిన వార్తే అది అన్నారు. నాకు 84 ఏళ్లు వచ్చినా ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే.. ప్రతి విషయాన్ని పాజిటీవ్ గా ఆలోచించడమే. నేను ఎప్పుడూ సగటు మనిషిగానే ఉంటాను.. ఎదో చేయాలి.. అందరికంటే నేను ఎక్కువ అనే ఆలోచన దోరణి లేదు. ప్రశాంతంగా ఉంటు ఆరోగ్యం కూడా బాగుంటుంది అని అన్నారు.