దాసరి నారాయణరావు జీవించి ఉన్నప్పుడు.. ఆయన ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేవారు. ఎవరికి ఏం సమస్య వచ్చినా.. ఎవరి మధ్య అయినా విబేధాలు ఉన్నా ఆయన వాటిని సమారస్యంగా పరిష్కరించేవారు.. సాయం చేసేవారు. ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో అన్ని వేళ్లు.. మెగాస్టార్ చిరంజీవి వైపే చూపించాయి. కానీ చిరు మాత్రం.. ఈ పెద్దరికపు కిరీటాలు నాకు అక్కర్లేదు.. ఇండస్ట్రీకి కష్టం వస్తే.. ఆదుకోవడానికి నేను ముందుకు వస్తాను అని తేల్చి చెప్పారు. కానీ ఆయన ఒప్పుకున్న.. ఒప్పుకోకపోయినా.. చిరంజీవినే తమ పెద్దగా ఇండస్ట్రీ భావిస్తోంది. ఇదే విషయాన్ని వెల్లడించారు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్. సుమన్ టీవీకిచ్చిన ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఆచార్య సెన్సార్ టాక్.. సినిమా ఎలా ఉందంటే..!
‘‘దాసరి తర్వాత చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్ద అని అంటున్నారు. కానీ ఆయనేమో వద్దు అంటున్నారు. మరి నెక్స్ట్ ఇండస్ట్రీ పెద్ద ఎవరు’’ అన్న ప్రశ్నకు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి గారు ఆ మాట అనడం తప్పు.. నాయకత్వం ఒకరు ఇచ్చేది కాదు.. నాయకత్వం ఆయన తెచ్చుకున్నది కాదు. ఆయనను నమ్ముకుంటే తమ కష్టం తీరుతుందని.. చిరంజీవిని ముందుపెట్టి.. సమస్యను చెప్పుకోవడమే పెద్దమనిషితనం. ప్రస్తుతం ఆ పొజిషన్లో చిరంజీవి తప్ప ఇంకొకరు లేరు.. కష్టం తెలుసుకుని తీర్చేవారు లేరు. చిరంజీవి వస్తే.. మిగతా హీరోలంతా కదిలి వస్తారు. కష్టం వచ్చిందా.. సాయం చేస్తాం అంటారు. చిరంజీవి గారి కంటే సమస్యల్ని భుజాన వేసుకునే వ్యక్తి లేరు. రెండు రాష్ట్రాల్లో సీఎంల తర్వాత ఆ రేంజ్ ఉన్న వ్యక్తి చిరంజీవి ఒక్కరే. ఆయన పారలల్ సీఎంగా ఉన్నారు. ఆయనే మా ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి. ఆయనే మా ధైర్యం’’ అని చెప్పుకొచ్చారు కాదంబరి కిరణ్. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Jr. ఎన్టీఆర్ పై మరోసారి అభిమానాన్ని బయటపెట్టిన చరణ్!