సైదాబాద్‌కు చెందిన జయలక్ష్మి వరల్డ్ చిల్ట్రన్స్ పార్లమెంట్ ప్రధానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయలక్ష్మి డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోంది. గతంలో ఆమెకు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ నుంచి ‘డే ఆఫ్ ది గర్ల్ ఛాలెంజ్ రన్నరప్-2021’ పురష్కారం వచ్చింది. అంతేకాదు! ఛేంజ్ మేకర్ అన్న అవార్డు కూడా వచ్చింది. జయలక్ష్మి సాధించిన విజయాలపై ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ స్టోరీ వచ్చింది. ఆ స్టోరీలో ఈ విధంగా ఉంది. జయలక్ష్మి సివిల్స్ సాధించటం కోసం ఎంతో శ్రమిస్తోంది. అయితే, ఇందుకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించటం లేదు. జయలక్ష్మి తల్లిదండ్రులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తూ ఉంటారు. అలాంటి వారికి పూట గడవటమే కష్టం. దీంతో కూతుర్ని ఉన్నత చదువులు చదివించటం అన్నది కుదరని పని.
జయలక్ష్మి సాయం కోసం ఎదురుచూస్తోంది అని ఉంది. ఈ స్టోరీని ప్రముఖ బహుభాషా నటుడు జగపతి బాబు తల్లి చదివారు. అమ్మాయి సాధించిన విజయాలకు పొంగిపోయారు. జయలక్ష్మికి సహాయం చేయాలని జగపతి బాబుకు చెప్పారు. దీంతో ఆయన జయలక్ష్మికి అండగా నిలవటానికి నిర్ణయించుకున్నారు. ఆమెను పిలిచి మాట్లాడారు. సివిల్స్ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. కాగా, జగపతి బాబు ప్రస్తుతం పలు ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సలార్’ సినిమాతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. మరి, జయలక్ష్మి లాంటి ప్రతిభ ఉన్న విద్యార్థినికి జగపతి బాబు అండగా నిలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.