ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ రావాలన్నా ఆయా జానర్స్ లో ఎక్కువ సినిమాలు చేస్తుంటారు హీరోలు. కానీ.. కొంతమందికి మాత్రమే కటౌట్, స్మైల్ బట్టి.. ఇమేజ్ వచ్చేస్తుంటుంది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో ఎవరైనా ముందుగా లవ్ స్టోరీస్ చేసి, ఆ తర్వాత మాస్ సినిమాల వైపు అడుగులేస్తుంటారు. ప్రత్యేకంగా లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ.. కొంతమందిని చూడగానే లవర్ బాయ్ ట్యాగ్ ఇచ్చేయాలని అనిపించేస్తుంది. అలాంటి హీరోలలో అబ్బాస్ ఒకరు. అవును.. అబ్బాస్ లవర్ బాయ్ గా పాపులర్ అయ్యాడు. ఆ ఇమేజ్ కోసం అతను ట్రై చేయలేదు. ప్రేక్షకులే అబ్బాస్ కి లవర్ బాయ్, హ్యాండ్సమ్ అంటూ కితాబులు ఇచ్చేశారు.
అలాంటి క్రేజ్ ఇండస్ట్రీలో చాలా తక్కువమంది విషయంలో జరుగుతుంది. 2000ల టైంలో అబ్బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెస్ట్ బెంగాల్ లో పుట్టిన అబ్బాస్.. తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించుకోవడం విశేషం. అలాగే తెలుగులో కూడా పలు హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా అబ్బాస్ అనగానే అందరికి ‘ప్రేమదేశం’ సినిమా గుర్తొస్తుంది. అప్పటివరకూ మోడలింగ్ లో బిజీ అయిన అబ్బాస్.. ప్రేమదేశం సినిమాతో సినిమాల్లో డెబ్యూ చేశాడు. మొదటి సినిమానే సూపర్ క్రేజ్ తీసుకొచ్చేసరికి.. వరుసగా సినీ అవకాశాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇక ప్రేమదేశం తర్వాత నరసింహ, రాజా, కృష్ణబాబు, నీ ప్రేమకై, ప్రియురాలు పిలిచింది, అనసూయ, ఇది సంగతి లాంటి సినిమాలు చేశాడు. కెరీర్ లో దాదాపు 60 సినిమాలలో నటించిన అబ్బాస్.. తమిళంలో ఎక్కువ సినిమాలు చేశాడు. అయితే.. హీరోగా ఫామ్ లో ఉండగానే ఫ్యాషన్ డిజైనర్ ఇరుమ్ ఆలీ. అబ్బాస్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుండి.. అతని సినిమాలకు వర్క్ చేస్తూ వచ్చింది. అబ్బాస్ సినిమాల్లో డెబ్యూ చేసిన ఏడాదికే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి టైంకి వీరిద్దరి వయసు 22 ఏళ్ళు. ఆ తర్వాత పిల్లలు పుట్టాక కూడా ఇరుమ్ ఆలీ.. అబ్బాస్ సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసింది.
ఇదిలా ఉండగా.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు తగ్గించేశాక అబ్బాస్ పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా అలరించాడు. అయితే.. అబ్బాస్ తన ఫ్యామిలీ గురించి మాత్రం ఎప్పుడు పెద్దగా బయటపెట్టలేదు. కాగా.. అబ్బాస్, ఇరుమ్ లకు ఓ కొడుకు అయిమాన్, కూతురు ఎమిరా అలీ ఉన్నారు. అబ్బాస్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో.. అతని భార్య, పిల్లలు కూడా అంతే అందంగా ఉంటారు. ప్రస్తుతం అబ్బాస్ కూతురు ఎమిరా అలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో అందంగా హీరోయిన్స్ ని మరిపించేలా కనిపిస్తోంది ఎమిరా. ఇక కొన్నాళ్ళుగా అబ్బాస్ నటనకు దూరంగా ఉంటూ.. న్యూజీలాండ్ లో ఉంటున్నాడు. మళ్లీ సినిమాల్లోకి వస్తాడో లేదో తెలియదు. కానీ.. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. మరి హీరోయిన్స్ కంటే అందంగా ఉన్న అబ్బాస్ కూతురు అలీని మీరు కూడా చూడండి.