మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి ఒక మత గ్రంధం లాంటివారు. గ్రంధానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. అది ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది. అలా చిరంజీవి కూడా ఎంతోమందిని ప్రభావితం చేశారు. తన నటనతో, తన మాటలతో, తన సినిమాల్లోని చక్కని సందేశంతో ఎంతోమంది యువకుల్ని ప్రభావితం చేశారు. 90స్ వారికే కాదు. నేటి తరం వారికి కూడా ఆయనొక ఇన్స్పిరేషన్. ఒక వర్గం వారికి మెగాస్టార్ ఒక ఇన్స్పిరేషన్. కష్టపడి పైకి రావాలనుకునే వర్గానికి ఆయనొక ఇన్స్పిరేషన్. ఏ తరం వారినైనా ఇన్స్పైర్ చేయగల లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి. ఆయన కోసం పడి చచ్చే అభిమానులు ఆ తరంలోని కాదు, ఈ తరంలో కూడా ఉన్నారు. రాబోయే తరాల్లో కూడా ఉంటారు. అదీ మెగాస్టార్ రేంజ్.
అలాంటి మెగాస్టార్ కి ఇప్పటికీ యూత్ లో క్రేజ్ ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలని ఇష్టపడే యూత్ కి చిరంజీవి మీద ఈ రేంజ్ లో అభిమానం ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా చేశారు. ఎవరో కాదు మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులు. మల్లారెడ్డి కాలేజీకి చెందిన 6 వేల మంది విద్యార్థులంతా ఒక సమూహంగా ఏర్పడి చిరంజీవి ముఖ చిత్రాన్ని సృష్టించారు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు లుక్ లో అందరూ కలిసి ఈ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజీలో.. ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘కిల్ క్యాన్సర్’ పేరుతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ కి కాలేజ్ విద్యార్థులంతా కలిసి మెగా ట్రిబ్యూట్ ని ఇచ్చారు. ఈ అద్భుత దృశ్యాన్ని వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి ఘటన ఆ మధ్య రామ్ చరణ్ విషయంలోనూ జరిగింది. జయరాజ్ అనే ఒక అభిమాని.. చరణ్ మీద ఉన్న అభిమానంతో తన వరి పొలంలోని పంటను రామ్ చరణ్ ముఖ చిత్రంగా మలిచి అదరహో అనిపించారు. ఇప్పుడు చిరంజీవికి సైతం కాలేజ్ విద్యార్థులు ఇలా అభిమానాన్ని చాటుకుని అభిమానంలో మరో ఫీట్ ని సాధించారు. ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
What a great tribute to our Megastar @KChiruTweets garu from the students and Management of Mallareddy college 👌👏👏
Clearly shows your love and affection towards BOSS 🙌, Big thanks from me and the entire team of #WaltairVeerayya 🙏❤️@MythriOfficial https://t.co/nv932COUnH— Bobby (@dirbobby) October 30, 2022