ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ అన్నది బాగా వాడుకలోకి వచ్చింది. కొన్నేళ్ల కిందటి వరకు ఫారెన్ కంట్రీస్‌లో మాత్రమే ఉన్న ఈ సంప్రదాయం ఇండియాలోకి కూడా వచ్చింది. ముఖ్యమైన నగరాల్లో.. పట్టణాల్లో తారా స్థాయిలోకి చేరుకుంది. డేటింగ్ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. యువతీ, యువకులు విచ్చల విడిగా డేటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. నేరాలు కూడా జరుగుతున్నాయి. డేటింగ్‌పై అసలు ఎలాంటి అవగాహన లేని కారణంగానే ఈ తప్పులు జరుగుతున్నాయని ప్రముఖ సైకాలజిస్ట్, న్యూరోమెంటర్ పూజితా జోష్యుల అన్నారు. డేటింగ్‌కు గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఒకప్పుడు మనకు డేటింగ్ అంటే ఏంటో తెలీదు. కేవలం ఫారెన్ కంట్రీస్‌లో ఉండేది.
మన దగ్గరికి వచ్చే సరికి అటుకొంత, ఇటుకొంత మధ్యలో ఉండిపోయింది. ఇటు వెస్ట్రన్ కాదు.. అటు ట్రెడిషన్ కాదు. డేటింగ్ అనేది ఒక ట్రేల్ మాత్రమే. పెళ్లి చేసుకోవటానికి ముందు. లేదా ఒక రిలేషన్‌లోకి దిగటానికి ముందు డేటింగ్ అనేది ఓ టెస్ట్ డ్రైవ్ లాంటిది. కారు కొనేముందు కారులో అన్నీ బాగా ఉన్నాయా? లేదా? అని తెలుసుకోవటానికి టెస్ట్ డ్రైవ్‌కు వెళతాం. లేదా ఏదైనా డ్రెస్ కొనుక్కునే ముందు ట్రైల్ రూములోకి వెళ్లి వేసుకుని చూస్తాం. అది డేటింగ్ అంటే.. డేటింగ్ అనేది ఒక ఈవెంట్. కమిట్‌మెంట్ మాత్రం కాదు. ఇప్పుడు చాలా మంది డేటింగ్‌నే కమింట్‌మెంట్ అనుకుంటున్నారు.
డేటింగ్‌లోకి వెళ్లిపోయామంటే.. సెక్సువల్‌గా కనెక్ట్ అయిపోవటం కాదు. ఇంక ఈ అమ్మాయే మీ లవర్ అనుకోవటం కాదు. ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోండి. ముందు మాట్లాడుకోండి. వాళ్లు ఎందుకు డేటింగ్‌కు వస్తున్నారో అడిగి తెలుసుకోండి. ఇదే నిజమైన డేటింగ్. డేటింగ్ వేరు రిలేషన్‌షిప్ వేరు. మీరు డేటింగ్ చేయబోతున్న వారు ఎందుకు రిలేషన్‌షిప్‌లోకి రావాలనుకుంటున్నారో తెలుసుకోండి. సెక్స్ కోసం రిలేషన్‌లోకి వస్తున్నారా? అడిగి తెలుసుకోండి. దీనివల్లే నేరాలు జరుగుతున్నాయి. లేదా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా? లేదా సరదాగా, టెంపరరీగా తిరగటానికి ఐ లవ్ యూ చెబుతున్నారా? మీరు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
వాళ్లు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అన్నది తెలుసుకోండి. ఇప్పుడు చాలా రకాల రిలేషన్‌లు ఉన్నాయి. వాటిలో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఒకటి. ఇందులో ఫ్రెండ్స్‌గానే ఉండి శృంగార కోర్కెలు తీర్చుకుంటూ ఉంటారు. అయినా కూడా ఫెండ్స్‌గానే ఉంటారు. ఫ్లింగ్ అనేదాంట్లో కేవలం శృంగార కోర్కెలు తీర్చుకోవటానికే కొద్దిరోజులు రిలేషన్‌లో ఉంటారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే.. డేటింగ్ అనేది ఓ ఈవెంట్.. రిలేషన్ అనేది ఓ కమిట్‌మెంట్. మీరు దేని కోసం డేటింగ్‌లోకి వెళుతున్నారు. అవతలివాళ్లు దేని కోసం డేటింగ్‌లోకి వస్తున్నారు. అడిగి తెలుసుకోవటం మంచిది’’ అని అన్నారు.