సంసారంలో అలకలు, అరమరికలు సర్వసాధారణం. అయితే గొడవలు పడని దంపతులు ఉండరు అని అందరికీ తెలిసిందే. ఎంత గొడవ పడితే అంత ప్రేమ ఉన్నట్లు అని మనకు కొటేషన్లు ఉండనే ఉన్నాయి. అయితే ఈ గొడవలను సద్దుమణిగించుకోవడానికి ఉన్న ఏకైక ఆప్షన్ పడకగది. సాధారణంగా చాలామంది గొడవలు, అలకలు అన్నీ లైట్లు ఆపేసిన తర్వాతే తీరుతాయి. ఎంత గొడవ జరిగినా కూడా పడుకునే సమయంలో ఒకరితో కాసేపు అలా ముచ్చట్లు చెప్పుకోవడం, ముద్దుముచ్చట్లు తీర్చుకోవడం వల్ల అంతా సెట్ అయిపోతుంది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని/తెలిసిన విషయం ఏంటంటే. కొన్ని గొడవలు పడకగది నుంచే మొదలవుతాయి. అవి తీరాలి అంటే ఈ చిన్న చిట్కాలు ఫాలో కావాల్సిందే.
సాధారణంగా పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్నింటిలో రాణిస్తున్నారు. అన్ని విషయాల్లో స్త్రీలు పురుషులతో పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికీ పడకగది విషయానికి వచ్చేసరికి పురుషులతో ఆధిపత్యం నడుస్తోందనే భావన ఉంకా ఉంది. భర్తకు నచ్చినట్లు, నచ్చినప్పుడు సె*క్స్ చేయడం చేస్తుంటారు. అయితే అన్ని విషయాల్లో స్త్రీల అభిప్రాయాలు తీసుకునే పురుషులు ఒక్క శృంగారంలో మాత్రం వారికి నచ్చిందే చేస్తుంటారు. అది తమ భాగస్వామికి నచ్చిందా? అతనిలా తను కూడా ఎంజాయ్ చేస్తోందా? అనే మాటలు పట్టించుకోరు. చాలా మంది స్త్రీలు ఇలాంటి విషయాలు చర్చిస్తే భర్తను తక్కువ చేసినట్లు అవుతుందని బయటకు చెప్పుకోరు కూడా. ఆమె ఎంజాయ్ చేయగలుగుతోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీదే.
పడకగదిలో మీరు ఇలాంటి తప్పులను చేయడం మానేస్తే.. మీరు ప్రత్యేకంగా భాగస్వామి గురించి ఆలోచించాల్సిన పని లేదు. పడకగదిలో భార్యతో ప్రేమగా ఉండండి. లైట్లు ఆపేయగా ఇంక అదే పని అన్నట్లు ప్రవర్తించడం మానేయండి. ముందు భార్యతో ప్రేమగా మాట్లాడండి. రోజు మొత్తంలో మీ ఆఫీస్‌లో ఏం జరిగిందో చెప్పండి. తను హౌస్‌వైఫ్ అయితే ఇంట్లో ఏ చేశారు? తన రోజు ఎలా గడిచిందో అడిగి తెలుసుకోండి. తిన్నామా, ఫోన్ చూసుకున్నామా, మన పని కానిచ్చి పడుకున్నామా అనే మాదిరిగా ఉండకండి. భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకుని ముచ్చట్లు చెప్పండి. తన ఇష్టా ఇష్టాల గురించి చర్చించండి. మీకు తనపై ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పండి. చేతల్లో మీ ప్రేమను ఎప్పుడూ చూపిస్తున్నప్పటికీ మాటల్లో కూడా చెబుతుండాలి.
పడకగదిలో స్త్రీలు భర్త నుంచి కోరుకునేది సె*క్స్ మాత్రమే కాదు. భర్త నుంచి వారు ముందు ప్రేమను కోరుకుంటారు. అలాగే కార్యం మొదలు పెట్టే సమయాన్ని కూడా మీరు పరిశీలించుకోవాలి. ముందు ఆమె శరీరాన్ని తాకుతూ ప్రేరేపించాలి. తర్వాత ఆమె శరీర భాగాలను తడుముతూ రెచ్చగొట్టాలి. తర్వాత ముద్దులతో ముంచెత్తాలి. చిన్నగా ఆమెను కూడా మూడ్‌లోకి తీసుకెళ్లాలి. ఆమె వద్ద ఉన్న ఎన్నో అందాలు, సొగసులు, నిధులను కొల్లగొట్టండి. ఆమెను, ఆమె శరీరాన్ని, అందాన్ని పొగడ్తలతో ముంచెత్తండి. శృంగారం అంటే సైలెంట్‌గా చేసుకునే పని కాదు. కార్య కొనసాగిస్తూ కూడా ఆమెతో మాట్లాడుతూ ఉండాలి. కొన్నిసార్లు డర్టీ జోకులు కూడా మీకు బాగా పనికొస్తాయి.
అలాగే నేరుగా క్లైమాక్స్ కి రాకండి. ఏ పని అయినా మొదలు నుంచి ముంగిచే వరకు ఒక పద్ధతిగా చేయాలి. ఇల్లు కట్టాలంటే ముందు పునాదులు వేయాలి.. అంతేగానీ ముందే స్లాబ్ వేసేయకూడదు. అలాగే శృంగారం అంటే నేరుగా ఆ పనిని మొదలు పెట్టేయకూడదు. చిన్నగా మొదలు పెట్టి తారస్థాయికి తీసుకెళ్లాలి. ఆనందంగా పనిని ముగించాలి. అలా చేస్తూ మీరు ఎలా అయితే శృంగారాన్ని ఆనందిస్తూ ఒత్తిడిని మర్చిపోతారో.. అలాగే మీ భార్య కూడా ఆ అనుభూతిని పొందుతారు. అలాగని ప్రతిసారి ఇలా చేయలా? అంటే అది మీ భార్య మూడ్, ఆమెన్న మానసిక, శారీరక స్థితిని బట్టి ఉంటుంది. స్త్రీ ఎప్పుడైతే అందుకు నో చెప్పిందో.. అప్పుడు ఆమెను ఫోర్స్ చేయకండి. తన అభిప్రాయానికి గౌరవం ఇవ్వండి. పడకగదిలో సె*క్స్ మాత్రమే కాదు.. ఆమెను అర్థం చేసుకోండి.. ఆనందంగా జీవించండి.