ఈ సృష్టిలో చాలా విచిత్రమైన బంధం ఏదైనా ఉంది అంటే.. అది భార్యభర్తల బంధమే. అప్పటి వరకు ఒకరికి ఒకరు పరిచయం లేకుండా.. మూడు ముళ్ల బంధంతో ఇద్దరి జీవితాలు ఒక్కటైపోతాయి. ఇక అక్కడ నుండి భర్త పడే కష్టం అంతా భార్యబిడ్డల సుఖ సంతోషాల కోసమే. భార్య తాపత్రయం అంతా భర్త ఆనందం కోసమే. ఇలాంటి దాంపత్య బంధంలో ఒకరి కష్టాన్ని మరొకరు గుర్తించడం, ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించడం, అన్నిటికీ మించి.. ఒకరిపై ఒకరు తరుచుగా ఇష్టాన్ని వ్యక్తం చేసుకోవడం చాలా అవసరం. కానీ.. ఈరోజుల్లో భార్యలకు ఇలాంటి అప్రిషియేషన్స్, రికగ్నైజేషన్, ఎఫెక్షన్ దొరకడం లేదు. భార్య అంటే.. చాకిరీ చేసే ఒక యంత్రంలా భావించే మగాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్ లో మీరు కూడా ఉంటే.. మీరు కూడా తప్పు చేస్తున్నట్టే లెక్క.
వంశాన్ని, జీవితాన్ని నిలబెట్టడానికి భార్య ప్రతినిత్యం కష్టపడుతూనే ఉంటుంది. అలాంటి ఇల్లాలికి ఇంటి పనుల్లో కాస్త సహాయం చేస్తే ఆమె ఆనందానికి హద్దులే ఉండవు. చాలా మంది మగవారు.. తమ భార్యని భోజనం చేశావా అని అడగడానికి కూడా ఇష్టపడరు. రోజూ కస్టపడి మన కడుపు నింపే భార్యని.. తిన్నావా? అని పలకరిస్తే వచ్చే నష్టం ఏమిటి? వారిని కాస్త ఇంటి వాతావరణం నుండి బయటకి తీసుకుని పోవడం, అప్పుడప్పుడు కొన్ని గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడం.. వారిపై మీకున్న ప్రేమని అప్పుడప్పుడు వ్యక్తం చేస్తుండటం చేస్తూ ఉండాలి. ఇలా భార్య కష్టాన్ని గుర్తించి, ఇవ్వాల్సిన గుర్తింపుని ఇస్తే.. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.