ప్రేమ అంటే జీవిత భాగస్వామి అడిగినవే కాకుండా.. ఏం కావాలో అర్థం చేసుకుని ఇవ్వగలగాలి. భాగస్వామి అడిగినవే ఇవ్వరు కొంతమంది. ఇక తనకి ఏం కావాలో తెలుసుకుని ఇవ్వడం అనేది మిషన్ ఇంపాజిబులే. డబ్బుతో కొనే వస్తువులు ఇవ్వడం కంటే.. డబ్బుతో కొనలేనిది ఒకటి ఉంది. దాని పేరే స్వర్గం. ఆ స్వర్గాన్ని భాగస్వామికి ఇవ్వడమే భాగస్వామి యొక్క ప్రథమ కర్తవ్యం. అది ఇవ్వని నాడు స్వర్గం ఎక్కడ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు. మగాళ్లకు శృంగార సామర్థ్యం కన్నా శృంగార కోరికలు బాగా ఎక్కువ. ఈ విషయంలో స్త్రీలు భిన్నంగా ఉంటారు. శృంగార కోరికలు తక్కువ, సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి స్త్రీలలో కోరికలు రగిలితే.. ఆ వేడిని చల్లార్చడం భర్తకు పెద్ద సవాలే.
చాలా మంది స్త్రీలకు బంగారం, చీరలు, ఇతర వస్తువుల పట్ల వ్యామోహం ఉంటుంది. అయితే వీటన్నిటికంటే కూడా మరొక దాని పట్ల విపరీతమైన వ్యామోహం ఉంటుందని గుర్తించగలిగితే ఆడు మగాడ్రా బుజ్జి అని ఆమె ఫీలవుతుంది. భార్య కోరుకునే వాటిలో శృంగారం ఒకటి. ఆ సమయంలో భార్యకి ఇచ్చే సుఖం వంద టన్నుల బంగారంతో సమానం. సరిగ్గా ఇవ్వాలే గానీ శృంగారం.. బంగారాన్ని డామినేట్ చేసేస్తుంది. భార్యని సంతృప్తిపరచడం అనేది ఒక ఆర్టు. ఆ ఆర్టులో ఆరితేరిన వారు శృంగార సామ్రాజ్యానికి చక్రవర్తులవుతారు. భార్యాభర్తల మధ్య అసూయ ఉండకూడదు. దాపరికాలు అస్సలు ఉండకూడదు. శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో ఒకరితో ఒకరు పంచుకోవాలి.
ఇగో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావ్ అని మనసు వస్త్రాలు విప్పేసి మాట్లాడుకోవాలి. సిగ్గు పడకూడదు. సంతృప్తిపరచడం లేదని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశం ఇవ్వడం కంటే.. అవకాశం తీసుకుని కావాల్సింది ఇవ్వడమే ఉత్తముల లక్షణం. భర్తకు నచ్చిన విధంగా భార్య.. భార్యకు నచ్చిన విధంగా భర్త ఒక అండర్ స్టాండింగ్ మీద శృంగార జీవితాన్ని బ్యాలన్స్ చేసుకుంటే.. జీవితం సాఫీగా సాగిపోతుంది. భర్తకు నచ్చినట్టు భార్య, భార్యకు నచ్చినట్టు భర్త ఉండకపోతే.. ఆ సంసారం అనారోగ్యానికి గురవుతుంది. శృంగారం అంటే మంచం మీద చేసే కార్యమే కాదు. భాగస్వామితో కలిసి సరదాగాబయటకు వెళ్లడం, పార్క్ కు వెళ్లడమో.. ఒక పార్టీకి వెళ్లడమో ఇలా చాలా ఉంటాయి.
భర్త పిలిచినా భార్య వెళ్ళాలి. భార్య షాపింగ్ కి పిలిచినా భర్త వెళ్ళాలి. ఇవన్నీ శృంగార జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. భర్త ఇష్టాన్ని భార్య, భార్య ఇష్టాన్ని భర్త కాదనకుండా ఉంటే చీకటి పడ్డాక శృంగార జీవితం సానుకూలంగా ఉంటుంది. అలా కాకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అంటే.. ప్రతికూలంగానే ఉంటుంది జీవితం. అలా అని భాగస్వామిని బలవంతం చేయకూడదు. నొప్పించకుండా ఒప్పించాలి. భాగస్వామిని అర్థం చేసుకోవడంలోనే ఉంది, కాపుర నిర్మాణం. ఒకరినొకరు అర్థం చేసుకుని.. సర్దుకుపోతే ఆ సంసార రథం ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. లేదంటే బతుకు జట్కా బండి అయిపోద్ది. భార్యని ఎలా సంతృప్తి పరచాలి? భర్తను ఎలా సంతృప్తి పరచాలి? భార్య, భర్తలు ఎలా ఉండాలి అనే అంశాల మీద అవగాహన కోసం ఈ కింది వీడియో చూడండి.